ETV Bharat / sitara

MAA Elections 2021: పోస్టల్ బ్యాలెట్​ పద్ధతిలోనే 'మా' ఎన్నికలు - ప్రకాష్ రాజ్ న్యూస్

'మా' పోలింగ్‌పై (MAA Elections 2021) ఎన్నికల అధికారి కృష్ణమోహన్ వివరణ ఇచ్చారు. పోస్టల్​ బ్యాలెట్ పద్ధతిలోనే 'మా' ఎన్నికలు జరగనున్నాయని స్పష్టంచేశారు.

MAA Elections 2021
మా ఎన్నికలు
author img

By

Published : Oct 5, 2021, 7:33 PM IST

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్(మా) ఎన్నికలు (MAA ELECTIONS 2021) పోస్టల్​ బ్యాలెట్​ పద్ధతిలోనే జరుగుతాయని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పష్టంచేశారు. పోలింగ్​ నిర్వహణపై ఆయన మంగళవారం వివరణ ఇచ్చారు.

"పోలింగ్ బ్యాలెట్ విధానంలో జరగాలని విష్ణు లేఖ రాశారు. ఈవీఎం ద్వారా పోలింగ్ జరపాలని ప్రకాశ్‌రాజ్ కోరారు. విష్ణు, ప్రకాశ్‌రాజ్‌ ప్రతిపాదనలు కృష్ణంరాజు దృష్టికి తీసుకెళ్లా. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కూడా బ్యాలెట్‌కే మొగ్గు చూపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు బ్యాలెట్‌తోనే 'మా' పోలింగ్ నిర్వహించనున్నాం" అని కృష్ణమోహన్ తెలిపారు.

'ఎవరు గెలిచినా మా భవనానికి రూ.6కోట్లు ఇస్తాం'

మా ఎన్నికల్లో ఏ ప్యానెల్‌ గెలిచినా భవన నిర్మాణానికి రూ.6 కోట్లు ఇచ్చేందుకు ఒకరు సిద్ధంగా ఉన్నారని సినీ నటుడు, 'మా' ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగి విరమించుకున్న సీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. అయితే, ఆ వ్యక్తి ఎవరనేది ఎన్నికలు అయిన తర్వాత 'మా' నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం రోజున చెబుతానని మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో తెలిపారు.

MAA Elections 2021
సీవీఎల్ నరసింహారావు

"దేవుడు నాకు కలలో కనిపించి 'నీకు ప్రెసిడెంట్‌ పదవి కావాలా? మా సభ్యుల సంక్షేమం కావాలా?' అని అడిగాడు. 'సభ్యుల సంక్షేమమే కావాలి' అని అనుకున్నా. అందుకే విత్‌డ్రా చేసుకున్నా. నన్ను ఎవరూ భయపెట్టలేదు. ఆశ చూపలేదు. రెండు ప్యానెల్స్‌కు నాదో విన్నపం. మురళీమోహన్‌ తీసుకొచ్చిన రిజల్యూషన్‌ను అమలు చేయండి. ఏ ప్యానెల్‌ గెలిచినా భవన నిర్మాణానికి రూ.6 కోట్లు ఇవ్వడానికి ఒకరు సిద్ధంగా ఉన్నారు. వాళ్లెవరో కొత్తగా ఎన్నికైన 'మా' అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం రోజున ప్రకటిస్తా. ఆరోగ్య బీమాను పక్కాగా అమలుచేయాలి. ఏ సభ్యుడు ఆకలితో బాధపడకూడదు. పెన్షన్‌కు సంబంధించి ప్రస్తుతం 30 మందికి నెలకు రూ.6 వేలు ఇస్తుండగా మరో రూ.4 వేలు కలిపి రూ.10 వేలు రెండేళ్ల పాటు ఇవ్వడానికి కొందరు వ్యక్తులు ఒప్పుకొన్నారు. వాళ్లెవరూ 'మా' సభ్యులు కాదు. నటులను అభిమానించే వారు. నేను అధ్యక్షుడినైతే అమలు చేయాలనుకున్న పథకాలను గెలిచిన వాళ్లు అమలు చేసేలా ప్రయత్నిస్తా" అని సీవీఎల్‌ నరసింహారావు తెలిపారు.

ఇవీ చూడండి:

MAA Elections: పోస్టల్​ బ్యాలెట్​ విధానంపై విష్ణు సంచలన వ్యాఖ్యలు

MAA Elections: 'ఈవీఎంలపై మాకు నమ్మకం లేదు'

'పోస్టల్​ బ్యాలెట్​తో మంచు విష్ణు మాయ'.. ప్రకాశ్​రాజ్​ ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.