ETV Bharat / sitara

Ram Pothineni: ఫిల్మ్​సిటీలో 'వారియర్'.. రామ్​ కోసం ఐదు భారీ సెట్లు - కృతిశెట్టి

Ram Pothineni: రామ్​ పోతినేని నటిస్తున్న 'వారియర్'​ చిత్ర షూటింగ్​ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్​సిటీలో జరుగుతోంది. సినిమాలోని యాక్షన్​ సన్నివేశాల కోసం భారీ సెట్​లను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. మరోవైపు 'బాహుబలి', 'రేసుగుర్రం' లాంటి చిత్రాల్లో బాల నటుడిగా మెప్పించిన సాత్విక్ వర్మ హీరోగా అరంగేట్రం చేయనున్నాడు.

Ram Pothineni
రామ్
author img

By

Published : Feb 4, 2022, 8:10 AM IST

Updated : Feb 4, 2022, 11:45 AM IST

Ram Pothineni: రామ్‌ మరోసారి తన యాక్షన్‌ సత్తా చూపెట్టడానికి భారీ ఎత్తున సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తోన్న చిత్రం 'ది వారియర్‌'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ప్రత్యేకంగా ఐదు భారీ సెట్లలను ఈ సినిమా కోసం తీర్చిదిద్దారు. వాటిల్లోనే రామ్‌, ఆది పినిశెట్టి తదితరులపై కీలకమైన పోరాట ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి నాయికగా నటిస్తోంది.

lingusamy ram pothineni movie
కృతిశెట్టి

హీరోగా బాల నటుడు..

'బాహుబలి', 'రేసుగుర్రం' లాంటి చిత్రాల్లో బాల నటుడిగా కనిపించి ప్రేక్షకుల్ని మెప్పించాడు సాత్విక్‌ వర్మ. ఇప్పుడతన్ని హీరోగా పరిచయం చేస్తూ.. శివ తెరకెక్కించిన చిత్రం 'బ్యాచ్‌'. రమేష్‌ గనమజ్జి నిర్మాత. నేహా పటాన్‌ కథానాయిక. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. తొలి భాగాన్ని ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

satvik varma child actor
'బ్యాచ్‌'

ఇదీ చూడండి: మేనల్లుడితో పవన్​ కల్యాణ్ మల్టీస్టారర్.. ఆ సినిమా రీమేక్​

Last Updated : Feb 4, 2022, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.