ETV Bharat / sitara

'లక్ష్య' ట్రైలర్.. 'పుష్పక విమానం' ఓటీటీ రిలీజ్ డేట్ - మడ్డీ ట్రైలర్

Lakshya Movie Trailer: టాలీవుడ్​కు సంబంధించిన కొత్త చిత్రాల కబుర్లు వచ్చేశాయి. ఇందులో 'లక్ష్య', 'మడ్డీ' ట్రైలర్​తో పాటు 'పుష్పక విమానం' ఓటీటీ రిలీజ్​ డేట్​కు సంబంధించిన వివరాలు ఉన్నాయి.

Muddy
Muddy
author img

By

Published : Dec 1, 2021, 5:38 PM IST

Pushpaka Vimanam OTT Platform: విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన సరికొత్త చిత్రం 'పుష్పక విమానం'. నవంబర్‌ 12న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. ఆనంద్‌ దేవరకొండ నటన చాలా బాగుందని అందరూ ప్రశంసించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. డిసెంబర్‌ 10వ తేదీ నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ఆహా వేదికగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుందని తెలిపింది. దామోదర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంద్‌ అమాయకుడైన స్కూల్‌ టీచర్‌ పాత్ర పోషించారు. కామెడీ, సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో గీతాషైనీ, శాన్వి మేఘన, సునీల్‌, హర్షవర్ధన్‌, నరేశ్‌ కీలకపాత్రలు పోషించారు. విజయ్‌ దేవరకొండ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.

Lakshya Movie Trailer: యువ కథానాయకుడు నాగశౌర్య కొత్త సినిమా 'లక్ష్య'. ఈ చిత్ర ట్రైలర్​ను తాజాగా విడుదల చేశారు. ఆర్చరీ నేపథ్య కథతో రూపొందించిన ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. డిసెంబర్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దక్షిణాదిలో బురద రేసింగ్ నేపథ్య కథతో వస్తున్న తొలి చిత్రం 'మడ్డీ'. డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డిసెంబర్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేశారు. స్టన్నింగ్​ విజువల్స్​తో ప్రచారం చిత్రం ఆకట్టుకుంటోంది.

ఇవీ చూడండి: యూఏఈలో కత్రినా కైఫ్​-విక్కీ కౌశల్​ ప్రేమజంట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.