ETV Bharat / sitara

'కేజీఎఫ్​ 2' ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు చీఫ్​ గెస్ట్​గా ప్రభాస్​​? - కేజీఎఫ్​ 2 చీఫ్ గెస్ట్​

KGF 2 pre release event Chief guest Prabhas: 'కేజీఎఫ్​ 2' ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను భారీగా ప్లాన్​ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమానికి చీఫ్​ గెస్ట్​గా పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ను ఆహ్వానించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

KGF 2 pre release event Chief guest Prabhas

author img

By

Published : Mar 23, 2022, 8:18 PM IST

KGF 2 pre release event Chief guest Prabhas: అభిమానులు ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న సినిమాలో 'కేజీఎఫ్​ 2' కూడా ఒకటి. కన్నడ రాకింగ్​ స్టార్​ యశ్​ నటించిన ఈ సినిమా వచ్చే నెల 14న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్​ను ప్రారంభించింది చిత్రబృందం. ఇందులో భాగంగానే ఇటీవలే 'తుఫాన్​' గీతాన్ని విడుదల చేయగా అది రికార్డులు సాధించింది. త్వరలోనే ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను భారీగా నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేస్తుందట. అన్నీ భాషల్లోనూ ప్రత్యేక ఈవెంట్లను నిర్వహించి అక్కడి స్టార్స్​ను చీఫ్​ను గెస్ట్​గా పిలవాలని యోచిస్తుందట. ఇందులో భాగంగానే తెలుగులోనూ స్పెషల్​ ఈవెంట్​ను నిర్వహించి ముఖ్య అతిథిగా పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్​ను పిలిచేందుకు సన్నాహాలు చేస్తుందని తెలిసింది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

ప్రస్తుతం ప్రభాస్​ చేస్తున్న భారీ సినిమాల్లో 'సలార్'​ కూడా ఒకటి. దీన్ని కూడా ప్రశాంత్​నీల్​ దర్శకత్వం వహిస్తున్నారు. అంతకుముందు ఈ సినిమా షూటింగ్​ ప్రారంభోత్సవానికి హీరో యశ్​ ముఖ్య అతిథిగా వచ్చేసి సందడి చేశారు.

'కేజీఎఫ్‌'కు సీక్వెల్​గా ఈ సినిమా సిద్ధమైంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. 'అధీరా' పాత్రలో ఆయన ప్రేక్షకుల్ని అలరించనున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌, టాలీవుడ్‌ నటుడు రావు రమేష్‌, ప్రకాశ్‌రాజ్‌ కీలకపాత్రలు పోషించారు.

ఇదీ చూడండి: సూపర్​ హీరోగా 'ఆర్​ఆర్​ఆర్'​ నిర్మాత తనయుడి ఎంట్రీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.