ETV Bharat / sitara

అతడితో జర్నీ చాలా బ్యూటిఫుల్: కీర్తి సురేశ్ - Good Luck Sakhi

Keerthy Suresh: ఆడపిల్లలను తక్కువ చేసి చూడటం, ఎదుగుతున్న క్రమంలో హేళన చేయడం లాంటివి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అలాంటివాటిని ఒక అమ్మాయి ఎలా ఎదుర్కొని నిలదొక్కుకుంది? అనే కథాంశంతో కీర్తి సురేశ్​ నటించిన కొత్త సినిమా 'గుడ్​ లక్​ సఖి'. ఈ చిత్ర ప్రమోషన్స్​లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలను చెప్పింది ఈ భామ.

Keerthy Suresh
కీర్తి సురేశ్
author img

By

Published : Jan 26, 2022, 5:38 PM IST

'గుడ్​ లక్​ సఖి' ప్రమోషన్​లో కీర్తి

Keerthy Suresh: అకారణంగా అమ్మాయిలపై వేసే అభాండాలను తానూ ఎదుర్కొన్నట్లు చెప్పింది కీర్తి సురేశ్. కెరీర్​ తొలినాళ్లలో షూటింగ్​, రిలీజ్​లకు కలిగే అడ్డంకులకు తనను నిందించేవారని వెల్లడించింది. తాజాగా తాను నటించిన కొత్త సినిమా 'గుడ్​లక్​ సఖి'. ఈ చిత్రం జనవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ పలు వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ చిత్ర దర్శకుడు నగేశ్​ కుకునూర్​తో తన జర్నీ ఎలా సాగిందో వివరించింది.

Keerthy Suresh
'గుడ్​ లక్​ సఖి'

"నగేశ్​ సర్​తో జర్నీ చాలా బ్యూటిఫుల్​గా ఉంటుంది. ఆయన నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. షూట్​ అయ్యాక మానిటర్​లో చూడటానికి వెళ్తే.. 'ఏం చూస్తున్నావు?' అని అడిగేవారు.. జుట్టు, మేకప్​ అని చెప్పేదాన్ని.. 'మరి పెర్ఫామెన్స్​ సంగతేంటి?' అనేవారు. అప్పుడిక మానిటర్​ చూడాల్సిన అవసరం లేదనుకున్నా. ఆయన కళ్లలోకి చూసి అర్థం చేసుకునేదాన్ని."

- కీర్తి సురేశ్, నటి

ప్రేమకు సమయం లేదు..

'గుడ్‌ లక్‌ సఖి' కోసం రాయలసీమ యాస నేర్చుకున్నట్లు తెలిపింది కీర్తి. డబ్బింగ్​ చెప్పి, బయటకు వచ్చాక కూడా అదే యాసలోనే తాను మాట్లాడేదానని తెలిపిందామె. ఇక వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల బాయ్​ఫ్రెండ్​, ప్రేమకు సమయం లేదని అంటోంది.

Keerthy Suresh
కీర్తి సురేశ్

గతేడాది విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేటకు జనవరి 28న విడుదలకానుంది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో మెరవనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సుధీర్‌చంద్ర పాదిరి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తుండటం విశేషం.

ప్రీరిలీజ్​ ఈవెంట్​కు చెర్రీ..

Keerthy Suresh
ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు అతిథిగా చరణ్

ఈ సినిమా ప్రీరిలీజ్​ ఈవెంట్​ బుధవారం సాయంత్రం 6 గంటలకు పార్క్​ హయత్​లో జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగాపవర్​ స్టార్​ రామ్​ చరణ్ అతిథిగా హాజరుకానున్నారు. తొలుత ఈ వేడకకు మెగాస్టార్​ చిరంజీవి హాజరుకావాల్సి ఉండగా, కరోనా సోకడం కారణంగా రాలేకపోతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'రాధేశ్యామ్' రిలీజ్​.. ఓటీటీ లేదా థియేటర్​లోనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.