ETV Bharat / sitara

Kangana: 16ఏళ్ల వయసులో ఆ పని చేసి ఇబ్బంది పడ్డా - కంగనా రనౌత్​ హీరోయిన్​ కెరీర్​

చిత్ర పరిశ్రమలో నటిగా తన 15 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు బాలీవుడ్​ హీరోయిన్​ కంగనా రనౌత్​ (Kangana Ranaut). ఓ అభిమాని పంపిన వీడియోను తన ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేస్తూ తనను ఆదరించిన ప్రేక్షకులకు అభిమానులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.

Kangana Ranaut Recalls Her Film Journey With A Fan-made Video
Kangana: 16 ఏళ్ల వయసులో నటిగా మారి ఇబ్బంది పడ్డా
author img

By

Published : Jun 29, 2021, 5:32 AM IST

నటిగా తన 15 ఏళ్ల సినీ ప్రయాణాన్ని(Kangana Career) గుర్తు చేసుకున్నారు బాలీవుడ్‌ హీరోయిన్​ కంగనా రనౌత్‌. హీరోయిన్​గా తాను ఈ స్థాయికి వచ్చేందుకు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో తెలియజేశారు. ఓ అభిమాని పంపించిన వీడియో ఇందుకు కారణమైంది.

కంగనాను అభిమానించే ఓ వ్యక్తి.. 2006 నుంచి 2021 వరకు కంగనా సినీ ప్రస్థానాన్ని వీడియో రూపంలో(Kangana Fan made video) సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశాడు. ఇందులో కంగనా పాల్గొన్న పలు ఇంటర్వ్యూ క్లిప్పింగ్స్‌ కనిపిస్తాయి. ఒక్క వీడియోలో తన కెరీర్‌ కళ్లముందు కదలాడటం వల్ల ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అదే వీడియోను పంచుకుంటూ తన మనసులోని భావాల్ని వ్యక్తపరిచారు కంగన.

"నా సోదరి పంపించిన ఈ ఫ్యాన్‌మేడ్‌ వీడియో నన్ను నవ్వించింది. నేను చిత్ర పరిశ్రమలో ఎలా ఎదిగానో ఇందులో చూడొచ్చు. చిన్న వయసులోనే (16 ఏళ్లు) నటిగా మారాను. ఆ సమయంలో ఇండస్ట్రీపై సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. విజయం అందుకునేందుకు దశాబ్దానికిపైగా సమయం పట్టింది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పిన మాటను నేను బాగా నమ్ముతాను. పైకి చెడుగా కనిపించే దాంట్లోనూ కొంత మంచి ఉంటుంది. మంచిగా కనిపించే దాంట్లోనూ చెడు దాగి ఉంటుంది. చూడాలా, వద్దా అనేది మన సమస్య కానీ వాస్తవంలో మార్పు ఉండదు."

- కంగనా రనౌత్​, బాలీవుడ్​ కథానాయిక

2004లో కెమెరా ముందుకొచ్చిన కంగనా 2006లో వచ్చిన 'గ్యాంగ్‌స్టర్‌' చిత్రంతో నాయికగా మారారు కంగనా రనౌత్​. విభిన్న పాత్రలు పోషించి, బాలీవుడ్‌లో నాయికా ప్రాధాన్య చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచారు. ప్రస్తుతం 'తలైవి', 'ఎమర్జెన్సీ', 'థాకడ్‌', 'తేజస్‌' చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రభాస్‌ హీరోగా పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన 'ఏక్‌ నిరంజన్‌' సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు.

ఇదీ చూడండి.. 'ఆర్​ఆర్​ఆర్​' సెట్లో చరణ్​.. 'లూసిఫర్'​ రీమేక్​లో తమన్​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.