ETV Bharat / sitara

'పుష్ప'పై కమల్​ ప్రశంసలు.. అలరిస్తున్న 'స్వాతిముత్యం' గ్లింప్స్ - sivakarthikeyan kamal hassan movie

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో పుష్ప, స్వాతిముత్యం, మన్మథలీల, శివకార్తికేయన్ కొత్త చిత్రానికి సంబంధించిన సంగతులు ఉన్నాయి.

pushpa movie kamal hassan
పుష్ప మూవీ కమల్​హాసన్
author img

By

Published : Jan 16, 2022, 8:27 AM IST

Pushpa movie: అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా చూసిన విలక్షణ నటుడు కమల్ హాసన్.. చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ కథతో తీసిన ఈ సినిమా థియేటర్లలో దుమ్మురేపింది. ప్రస్తుతం ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఇందులో బన్నీ సరసన రష్మిక హీరోయిన్​గా చేసింది. సుకుమార్ దర్శకత్వం వహించారు.

Sivakarthikeyan movie: తమిళ ప్రముఖ నటుడు శివకార్తికేయన్ కొత్త సినిమాపై ప్రకటన వచ్చేసింది. స్టార్ కమల్​హాసన్.. సోనీ పిక్చర్స్​తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాజ్​కుమార్ పెరియాసామి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభించడం సహా పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. శివకార్తికేయన్.. ప్రస్తుతం 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలోనూ ఓ ద్విభాషా చిత్రం చేస్తున్నారు.

siva karthikeyan kamal hassan movie
శివకార్తికేయన్-కమల్​హాసన్ మూవీ

బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేశ్​ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'స్వాతిముత్యం'. సంక్రాంతి పండగ సందర్భంగా గ్లింప్స్​ను రిలీజ్ చేయగా, అది అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇందులో గణేశ్.. అమాయక చక్రవర్తిలా నటిస్తున్నారు. లక్ష్మణ్ దర్శకత్వం వహిస్తున్నారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్​గా నటిస్తోంది. సితార ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు.

'మానాడు' సినిమాతో ప్రేక్షకుల్ని అలరించిన డైరెక్టర్ వెంకట్​ప్రభు కొత్త సినిమా ఫస్ట్​లుక్ వచ్చేసింది. 'మన్మథలీల' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అశోక్ సెల్వన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

manmadhaleela first look
మన్మథలీల్ ఫస్ట్​లుక్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.