కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా థియేటర్లు మూసుకుపోవడం వల్ల అనేక సినిమాల విడుదలలు వాయిదా పడ్డాయి. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియక దర్శకనిర్మాతలు సందిగ్ధంలో పడ్డారు. ఈ నేపథ్యంలో కొంతమంది తమ సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా విడుదల చేసేందుకు పూనుకున్నారు. పలు సినిమాలు కూడా విడుదలయ్యాయి. తాజాగా ఈ బాటలోకి 'గుంజన్ సక్సేనా-ద కార్గిల్ గర్ల్' సినిమా చేరింది. త్వరలోనే ఈ చిత్రాన్ని నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది చిత్రబృందం.
1999 కార్గిల్ యుద్ధంలో ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి, యుద్ధ ప్రాంతంలోకి వెళ్లిన మొదటి భారత మహిళా వాయుసేన అధికారిగా చరిత్ర సృష్టించారు గుంజన్ సక్సేనా. ఆమె జీవితం ఆధారంగా రూపొందిందీ చిత్రం.
ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ టైటిల్ రోల్ పోషించింది. పంకజ్ త్రిపాఠి, వినీత్ సింగ్, అంగద్ బేడి, మానవ్ విజ్ ఇతర పాత్రల్లో నటించారు. శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇది చూడండి : వెంటిలేటర్‌పై 'కరణం మల్లీశ్వరి' దర్శకురాలు!