Shanti Swaroop Jabardasth: ఈటీవీలో ప్రసారమయ్యే 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కార్యక్రమ వేదికపై తన జీవిత ప్రయాణాన్ని గుర్తుచేసుకుని శాంతి స్వరూప్ భావోద్వేగానికి లోనయ్యారు. కెరీర్ ప్రారంభంలో డబ్బుల్లేక అరటి పండ్లు తిని పడుకునేవాడినని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ షోలో 'జబర్దస్త్', 'ఎక్స్‌ట్రా జబర్దస్త్', 'ఢీ' కంటెస్టెంట్‌లకు అవార్డులు ప్రకటించారు.
ఈ క్రమంలో అవార్డు అందుకున్న తర్వాత స్వరూప్ మాట్లాడారు. "2001లో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో భోజనానికి డబ్బుల్లేక ప్రసాదంతో కడుపునింపుకునేవాడ్ని. ఆ సంగతి మా ఇంట్లో ఎప్పుడూ ప్రస్తావించలేదు. పది రూపాయలుంటే అప్పుడు నాకు అది పదివేలతో సమానం. రూ.10 పెట్టి అరటి పండ్లు కొనుక్కుని, వాటినే తిని నిద్రపోయేవాడ్ని. 2007లో మా నాన్న అంత్యక్రియలకూ నా దగ్గర డబ్బులేదు. రూ.2 వేలు అప్పు చేశా. ఇప్పుడు నా నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్తున్నాయంటే దానికి కారణం ఆది. నేను చనిపోయేటప్పుడూ ఆయన పేరే తలచుకుంటా" అని హృదయాల్ని బరువెక్కించారు. ఇదే వేదికపై ఇమ్మాన్యుయేల్- వర్ష జోడీ, ఆది తదితరులు తమ డ్యాన్స్‌తో విశేషంగా ఆకట్టుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: హైపర్ ఆది క్యారెక్టర్ గురించి చెప్పిన రైజింగ్ రాజు