Bhumi pednekar news: కరోనా మూడోవేవ్ త్వరగా ముగిసిపోతే ప్రేక్షకులను అలరించడానికి ఆరు చిత్రాలతో సిద్ధంగా ఉన్నానని హీరోయిన్ భూమి పెడ్నేకర్ చెబుతోంది. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ కమర్షియల్ విజయాలు అందుకొంటూ ముందుకెళుతోంది.

వచ్చే నెల 11న 'బధాయి దో' సినిమాతో థియేటర్లలో ప్రేక్షకుల్ని పలకరింబోతుంది భూమి. ఆ తర్వాత ఆమె నుంచి వరస చిత్రాలు రాబోతున్నాయి. 'లేడీ కిల్లర్', 'భీడ్', 'గోవిందా నామ్ మేరా', 'రక్షాబంధన్' చిత్రాల్లో నటిస్తోంది. త్వరలోనే మరో కొత్త చిత్రాన్ని ప్రకటించబోతుందట.
"కరోనా నుంచి ప్రజలు త్వరగా బయటపడిపోతే వాళ్లను అలరించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నా నుంచి వరసగా ఆరు వైవిధ్యమైన చిత్రాలు రాబోతున్నాయి. అన్నీ కూడా నా మనసుకు ఎంతో దగ్గరైన పాత్రలే. ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. తొలి సినిమా కోసం ఎంత కష్టపడ్డానో ఇప్పుడు అంతే. ఈ చిత్రాలన్నీ నాలో కొత్త నటిని ప్రేక్షకులు పరిచయం చేస్తాయి" అని భూమి చెబుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: