"నన్ను నమ్మండి.. నేను ఎవరితోనూ రిలేషన్‌లో లేను" అని అంటోంది శ్రీముఖి. తాజాగా ఇన్‌స్టా వేదికగా తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి వెల్లడించింది. చాలారోజుల తర్వాత సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన శ్రీముఖి పలు విశేషాలు పంచుకుంది. ఇప్పట్లో తనకి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని.. కాకపోతే లైఫ్ పార్ట్‌నర్ కోసం తాను ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.
నన్ను పెళ్లి చేసుకుంటావా?
డోంట్ మ్యారీ బీ హ్యాపీ
అక్కా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?
ఇదెక్కడి దారుణంరా బాబు
మీ ఫోన్ నంబర్ చెప్తే మెసేజ్ చేస్తా?
9848032919 (ఒక్కడు సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఫోన్ నంబర్). దీనికి కాల్ చేయండి.
మీమర్స్ (memes) గురించి మీ అభిప్రాయం?
నాకు మీమ్స్ అంటే ఎంతో ఇష్టం. ఈ మధ్య కాలంలో మీమ్స్‌ని ఎక్కువగా మిస్ అవుతున్నా.
మీ సెలబ్రిటీ క్రష్ ఎవరు?
రణ్‌వీర్ సింగ్
మీ తమ్ముడిని నేను ప్రేమిస్తున్నా?
అరేయ్ తమ్ముడా.. నీతో యూట్యూబ్ వీడియో చేయాలంటే నాకెంతో భయంగా ఉందిరా. వీడియో కింద నీ గురించే ఎక్కువ కామెంట్లు వస్తున్నాయ్.
పటాస్ (Patas) మిస్ అవుతున్నాం?
నేను కూడా ఎంతో మిస్ అవుతున్నా
మీరు ఎవరితోనైనా రిలేషన్‌లో ఉన్నారా? చాలామందికి ఈ డౌట్ ఉంది? క్లారిటీ ఇస్తే మేము సంతోషిస్తాం?
నాకు లవర్ లేరండి బాబు. నన్ను నమ్మండి
ఉన్నట్టుండి జాంబీ అపోకలిప్స్ (zombie apocalypse) వస్తే పరిస్థితి ఏమవుతుంది మాస్టారు?
ఏదో బ్లాక్, వైట్, యెల్లో ఫంగస్ అంటా!! నువ్వేమో జాంబీ అంటున్నావ్!!
మీరు నన్ను ప్రేమిస్తారా?
మిమ్మల్నే కాదు నా అభిమానులందర్నీ నేను ఇష్టపడతాను.
మీరు ఎప్పుడూ మానసిక ఒత్తిడి(Mental stress)కి గురికాలేదా?
గతంలో ఒకసారి నేను కూడా మానసిక కుంగుబాటుకు లోనయ్యా. కానీ ధైర్యంగా కోలుకున్నా. మానసిక కుంగుబాటుకు లోనవడం పెద్ద నేరం ఏమీ కాదు.
అక్కా.. బావ ఎప్పుడు వస్తాడు?
నేను కూడా ఎదురుచూస్తున్నా.
అమెరికా (America)ఎప్పుడు వస్తారు?
ప్రస్తుతానికి ఇంటి బయటకు వెళ్లడానికే దిక్కు లేదు. పరిస్థితులు చక్కబడిన తర్వాత తప్పకుండా వస్తా.
సోషల్‌మీడియాలో చాలా యాప్స్ బ్యాన్ అవుతున్నాయి కదా. మీ నంబర్ ఇస్తే గూగుల్ పే, ఫోన్ పేలో చాట్ చేస్తా?
ఇదేందయ్యా ఇది. నేను చూడలా.