ETV Bharat / sitara

ఉమెన్స్ డే: ఈ హీరోయిన్లు గుర్తొస్తే కనిపించేవి ఆ పాత్రలే

దిగువన ఉన్న జాబితాలో మీ ఫేవరెట్ హీరోయిన్​ ఉంటే కచ్చితంగా ఈ పాత్రకు మీరు ఫిదా అయ్యుంటారు. ఇంతకీ ఆ ముద్దుగుమ్మలు ఎవరు? వారి కెరీర్​లో చిరస్థాయిగా నిలిచిన ఆ పాత్రలు ఏంటి?.. ఓ లుక్కేయండి.

heroines seem to remember by their characters
ఈ హీరోయిన్లు గుర్తొస్తే కనిపించేవి ఆ పాత్రలే
author img

By

Published : Mar 8, 2020, 5:37 AM IST

సినిమా అంటే గుర్తొచ్చేది హీరోనే. ఎందుకంటే అతడు సాహసాలు చేస్తాడు. రొమాన్స్ పండిస్తాడు. హాస్యంతో నవ్విస్తాడు. విలన్​ను మట్టుబెడతాడు. ఇలా ఎన్నో రకాల పనులు చేసి మనల్ని అలరిస్తాడు. ఇప్పటివరకు వచ్చిన వాటిలో చాలా తెలుగు చిత్రాలు ఈ పంథాలోనే ఉన్నాయి. కానీ ఇలాంటి వాటిలోనూ కొందరు హీరోయిన్లు మెప్పించారు. కథానాయకుడికి మేం ఏం తక్కువ కాదని నిరూపించుకున్నారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతలా అంటే ఇప్పటికి వారి పేరు ఎక్కడ చూసినా, విన్నా.. వారు అదరగొట్టిన ఆ పాత్రే గుర్తొస్తుంది. అలా కొన్ని పాత్రలతో అభిమానుల మదిలో స్థానం సంపాదించుకున్న కొందరు హీరోయిన్లు వీరు. నేడు(ఆదివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారిపై ప్రత్యేక కథనం.

1. శ్రీదేవి-జగదేకవీరుడు అతిలోక సుందరి

'బ్యూటీ క్వీన్​' శ్రీదేవి గురించి ఇప్పటితరానికి తెలియకపోవచ్చు. కానీ 80, 90వ దశకాల్లో ఆమె నటించిన చిత్రాలన్నీ ప్రేక్షకాదరణ అందుకున్నాయి. అయితే వీటిన్నింటిలోనూ 'జగదేకవీరుడు అతిలోకసుందరి' ప్రత్యేకం. ఇందులో ఆమె ఇంద్రజ అనే దేవకన్యగా అదరగొట్టింది. మెగాస్టార్ చిరంజీవితో పోటీపడి నటించి, మెప్పించింది.

jagadik veerudu atiloka sundari
శ్రీదేవి-జగదేకవీరుడు అతిలోక సుందరి

2. గిరిజ- గీతాంజలి

దర్శకుడు మణిరత్నం తీసిన 'గీతాంజలి'.. టాలీవుడ్​లో గుర్తుంచుకోదగ్గ సినిమాల్లో ఒకటి. ఇందులో హీరోయిన్​గా గిరిజ నటించింది, కాదు కాదు అద్భుతంగా మెప్పించింది అనే చెప్పాలి. ఇప్పటికీ ఈ చిత్రం అంటే గుర్తొచ్చే పేరు గిరిజనే.

heroines seem to remember by one their famous characters
గీతాంజలిలో గిరిజ

3. ఆమని-శుభలగ్నం

పెళ్లి నేపథ్యంలో వచ్చిన 'శుభలగ్నం'లో ఆమని ఓ హీరోయిన్​గా నటించింది. డబ్బుల కోసం భర్త జగపతిబాబును అమ్ముకునే భార్యగా మెప్పించే ప్రదర్శన చేసింది.

శుభలగ్నంలో ఆమని

4.జెనీలియా-బొమ్మరిల్లు

'తల తల గుద్దుకుంటే కొమ్ములొస్తాయి తెలుసా' అంటూ 'బొమ్మరిల్లు' సినిమాలో హాసిని చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఆమె సొంత పేరు జెనీలియా అయినా, హాసినిగానే ఇప్పటికీ గుర్తుండిపోయింది.

bommarillu
బొమ్మరిల్లులో జెనీలియా

5. స్వాతి-అష్టాచమ్మా

'మహేశ్.. ఆ పేరులో వైబ్రేషన్ ఉంది' అంటూ హీరోయిన్ స్వాతి చేసిన హంగామా చూడాలంటే 'అష్టాచమ్మా' చూడాల్సిందే. ఎందుకంటే ఈ హీరోయిన్ లావణ్య పాత్రలో నటించింది అనడం కంటే జీవించేసిందనే చెప్పాలి. కథానాయికగా ఈమెకు ఇదే తొలి సినిమా. తన కెరీర్​లో ఈ స్థాయిలో హిట్​ అయిన చిత్రం మరొకటి లేదోమో!

అష్టాచమ్మాలో స్వాతి

6. నిత్యా మేనన్-అలా మొదలైంది

తొలి సినిమా 'అలా మొదలైంది'లో సొంత పేరుతో నటించి, ఆకట్టుకుంది నటి నిత్యా మేనన్. ఇందులో ఆమె పాట పాడటం మరో విశేషం. ఇందులో హీరో నాని కంటే నిత్యాకే అభిమానులు ఎక్కువ మార్కులు వేశారు!

అలామొదలైందిలో నిత్యామీనన్​

7. సమంత-ఏ మాయ చేశావే

'ఏ మాయ చేశావే' అంటూ తొలి చిత్రంతోనే మాయ చేసింది హీరోయిన్ సమంత. జెస్సీగా కనిపించి, కళ్లతోనే హావభావాలు పలికించింది. ఇప్పటికీ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.

yemaya chesave
ఏ మాయ చేశావే

8. లావణ్య త్రిపాఠి-అందాల రాక్షసి

'నాన్న నాకు త్వరగా పెళ్లి చేసేయండి.. ఈ చదువులూ అవి నావళ్ల కావట్లేదు' అంటూ ఈ చిత్రంలో ముద్దు ముద్దుగా నటించి, ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా, 'అందాల రాక్షసి'గానే ఇప్పటికీ గుర్తుండిపోయింది.

అందాల రాక్షసిలో లావణ్యత్రిపాఠి

9. తమన్నా-100% లవ్

అప్పటివరకు చిన్న సినిమాల్లో హీరోయిన్​ నటించిన తమన్నా.. సుకుమార్ తీసిన '100%లవ్​'తో స్టార్​గా మారింది. ఆ తర్వాత అగ్రహీరోల సరసన అవకాశాలు దక్కించుకుని టాప్ హీరోయిన్​ స్టేటస్ సొంతం చేసుకుంది.

100 %లవ్​లో తమన్నా

10. సాయిపల్లవి-ఫిదా

'ప్రేమమ్'లో మలర్​గా​ మనసు దోచిన సాయిపల్లవి.. తెలుగులో 'ఫిదా'తో ఎంట్రీ ఇచ్చింది. 'భానుమతి.. ఒక్కటే పీస్.. హైబ్రిడ్ పిల్ల' అంటూ అల్లరి చేసింది. ఇప్పటికీ ఆ సినిమాను పదేపదే చూసేలా చేసింది.

ఫిదాలో సాయిపల్లవి

ఇదీ చూడండి : ఆ దర్శకుడితో నాని సినిమా రానుందట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.