ETV Bharat / sitara

ధర్మేంద్రతో మాట్లాడనివ్వలేదు: హేమమాలిని - హేమమాలిని ధర్మేంద్ర

బాలీవుడ్​లో ఎన్నో సినిమాల్లో నటించి హిట్​పెయిర్​గా నిలిచిన ధర్మేంద్ర-హేమామాలిని జీవితంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగిందట. పెళ్లికాక ముందు తామిద్దరూ ఎంతో స్నేహంగా ఉన్నట్లు ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న హేమామాలిని వెల్లడించారు. ఒకానొక సందర్భంలో ధర్మేంద్రతో మాట్లాడనివ్వకుండా తన తండ్రి షూటింగ్​లకు వచ్చేవారని ఆమె తెలిపారు.

Hema Malini reveals her father tried to keep her away from dharmendra
ధర్మేంద్ర హేమామాలిని
author img

By

Published : Mar 6, 2021, 5:31 AM IST

అలనాటి బాలీవుడ్‌ నటి హేమమాలిని, నటుడు ధర్మేంద్ర ఎన్నో ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. హిందీ చిత్రపరిశ్రమలో తెరకెక్కిన పలు చిత్రాల కోసం కలిసి పనిచేసిన ఈ జంట హిట్‌ పెయిర్‌గా వీరిద్దరూ ప్రేక్షకాదరణ పొందారు. అయితే, ఓ ప్రముఖ రియాల్టీ షోకి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన హేమమాలిని.. తన ప్రేమకథ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ఒకానొక సందర్భంలో తనను ధర్మేంద్రకు దూరంగా ఉంచాలని హేమ తండ్రి భావించారట.

Hema Malini reveals her father tried to keep her away from dharmendra
హేమామాలిని

"ధర్మేంద్ర, నేనూ కలిసి చాలా సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించాం. మేమిద్దరం కలిసి తరచూ సినిమాలు చేయడం వల్ల మా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ విషయం మా ఇంట్లోవాళ్లకు తెలిసింది. అయితే, సాధారణంగా నేను ఏదైనా షూట్‌లో పాల్గొంటే.. నా వెంట అమ్మ లేదా బామ్మ సెట్‌కు వచ్చేవాళ్లు. కానీ, ఓసారి మాత్రం ధర్మేంద్రతో సినిమా చేస్తున్న సమయంలో నాతోపాటు నాన్న సెట్‌కు వచ్చారు. షూట్‌ అయ్యేంత వరకూ నాతోనే ఉన్నారు. ధర్మేంద్రతో మాట్లాడనివ్వలేదు. అలా మా ఇద్దర్నీ దూరంగా ఉంచాలని ఆయన భావించారు."

- హేమామాలిని, బాలీవుడ్ సీనియర్​ నటి

ప్రస్తుతం రాజకీయ నాయకురాలిగా రాణిస్తున్న హేమమాలిని.. అప్పుడప్పుడు సినిమాల్లోనూ నటించి మెప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే దాదాపు రెండేళ్ల క్రితం 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో బాలయ్య తల్లి పాత్రలో కనిపించారు. ప్రస్తుత సమాచారం ప్రకారం.. ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న 'ఆదిపురుష్‌'లో ఆమె రాముడి తల్లి కౌసల్యగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: అలనాటి నటి బయోపిక్​లో తమన్నా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.