వేణుమాధవ్ మంచి నటుడు మాత్రమే కాదు, మానవతావాది అని నటుడు శివాజీరాజా అన్నారు. ఎంతో మంది పేదలకు సాయం చేసిన గొప్ప మనిషని కీర్తించారు. సినిమాల్లోకి రాకముందు నుంచే వేణు తనకు తెలుసని, ఆయన లేని లోటు తీరనిదని హాస్యనటుడు అలీ అన్నారు. ఎంత కష్టం వచ్చినా.. చిరునవ్వు మాత్రం వదిలేవారు కాదని, ఆయన మరణం సినీ ప్రపంచానికి తీరని లోటని నటుడు ఉత్తేజ్ అన్నారు. వేణుమాధవ్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని ఎంతో కష్టపడి సినీరంగంలో అడుగుపెట్టారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో పలువురు.. వేణుమాధవ్ పార్థివదేహానికి నివాళి అర్పించారు.
చిరునవ్వుకు చిరునామా... వేణుమాధవ్ - comedian venu madhav is no more
మొదటి సినిమాతోనే పేరు తెచ్చుకుని అనతికాలంలోనే మంచి నటుడిగా ఎదిగిన వేణుమాధవ్ మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని నటులు శివాజీ రాజా, అలీ, ఉత్తేజ్, తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో వేణుమాదవ్ పార్థివదేహానికి నివాళులర్పించారు.