ETV Bharat / sitara

బాయ్​ఫ్రెండ్​ పక్కన ఉండగానే హీరోయిన్​కు ప్రపోజల్​ - సుస్మితా సేన్​ రోహ్మన్​

నటి సుస్మితా సేన్​కు(Sushmita Sen) విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఇన్​స్టా లైవ్​లో పాల్గొన్న ఆమెను, 'పెళ్లి చేసుకుంటారా?' అని ఓ అభిమాని అడిగాడు. సుస్మిత పక్కనే ఉన్న ఆమె ప్రియుడు, ఈ ప్రశ్నకు సమాధానమిచ్చాడు.

Fan proposes marriage to Sushmita Sen, watch how Rohman Shawl reacts
హీరోయిన్​కు లైవ్​లో ప్రపోజ్​ చేసిన అభిమాని
author img

By

Published : Jun 27, 2021, 3:16 PM IST

ప్రపంచ మాజీ సుందరి, బాలీవుడ్​ నటి సుస్మితా సేన్​(Sushmita Sen) సోషల్​మీడియా ద్వారా తరుచుగా తన అభిమానులతో ముచ్చటిస్తుంది. శుక్రవారం ఆమె ఇన్​స్టా​లో లైవ్​ నిర్వహించగా.. ఓ అభిమాని సుస్మితాకు పెళ్లి చేసుకుంటారా అని ప్రపోజ్​ చేశాడు. ఆ సమయంలో పక్కన ఉన్న ఆమె ప్రియుడు రోహ్మన్​(Rohman Shawl) స్పందించాడు.

ఓ వెబినార్​లో పాల్గొన్న తర్వాత సుస్మితా సేన్ శుక్రవారం ఇన్​స్టా లైవ్​ నిర్వహించింది. అందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. అయితే అంతలోనే ఓ అభిమాని తనను పెళ్లి చేసుకుంటావా? అని అడిగిన ప్రశ్నకు.. పక్కనే ఉన్న సుస్మితా ప్రియుడు రోహ్మన్​ 'లేదు' అని వెంటనే సమాధానమిచ్చాడు.

సుస్మితా సేన్​ ఇన్​స్టాగ్రామ్ లైవ్​

ఇదే లైవ్​లో సుస్మితా సేన్​ కూడా అసూయ పడే పరిస్థితి ఎదురైంది. ఆమె ప్రియుడు రోహ్మన్​ ఉద్దేశించి ఓ నెటిజన్​.. 'లవ్​ యూ రోహ్మన్'​ అంటూ​ కామెంట్​ చేయగా, 'థ్యాంక్యూ, కనీసం ఒక్కరైనా చెప్పారు నాకు!' అని రోహ్మన్​ అన్నాడు. దీనిపై సుస్మిత సరదాగా స్పందించింది. రోహ్మన్​ను ఉద్దేశిస్తూ.. 'నువ్వు నాకు తర్వాత కనపించు' అని చెప్పింది.

సుస్మితా సేన్​.. ప్రస్తుతం 'ఆర్య 2'(Aarya 2 Web series) వెబ్​సిరీస్​లో నటిస్తుంది. దీనికి సంబంధించిన అప్​డేట్స్​నూ పంచుకుంది. 'ఆర్య 2' చివరి షెడ్యూల్​ షూటింగ్​ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలిపింది. దీంతో పాటు రాబోయే సీజన్​లో సంగీతం ప్రధానంగా సాగనుందని వెల్లడించింది.

ఇదీ చూడండి.. Ariana: లేడి కళ్ల లేజరే నువ్వా.. పారడైస్​ ఫ్లేవరే నువ్వా!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.