బాలీవుడ్ నుంచి ఇప్పటికే తనకు చాలా ఆఫర్స్ వచ్చాయని, కానీ సరైన కథ కోసం వేచిచూస్తున్నానని ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ అన్నారు. 'పుష్ప' ప్రచారంలో భాగంగా గురువారం ముంబయి వెళ్లి బన్నీ.. హిందీ సినిమాల్లో తన ఎంట్రీ గురించి మరోసారి మాట్లాడారు.
"నాకు హిందీ సినిమాలంటే ఇష్టం. వాటిని చూస్తూనే పెరిగాను. కచ్చితంగా బాలీవుడ్లో నేరుగా సినిమా చేస్తాను. అది నా కెరీర్లోనే ల్యాండ్‌మార్క్ ఫిల్మ్ అవుతుంది. అందుకే అది ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటున్నాను. ఇప్పటికే కొన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ అవేవి అంత ఆసక్తిగా అనిపించలేదు. అన్ని సరిగ్గా కుదిరితే మాత్రం హిందీలో నా నుంచి భారీ సినిమా వస్తుంది" అని హీరో అల్లు అర్జున్ చెప్పారు.
అల్లుఅర్జున్ హీరోగా నటించిన 'పుష్ప' తొలిభాగం డిసెంబరు 17న పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కానుంది. ఇందులో రష్మిక హీరోయిన్. ఫహాద్ ఫాజిల్ కీలకపాత్ర పోషించారు. సునీల్, అనసూయ ప్రతినాయకులుగా నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు.
అయితే తన నుంచి రాబోయే సినిమాలు అన్నీ పాన్ ఇండియా రేంజ్‌లోనే ఉంటాయని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. భాష అనేది సినిమాకు అడ్డు కాకుడదని అన్నారు. 2000ల్లో ఉత్తరాది, దక్షిణాది అనే బేధం ఉండేదని, కానీ గత దశాబ్ద కాలంలో ఆ గీత చెరిగిపోతూ వచ్చిందని బన్నీ చెప్పారు.
ఎంతోమంది కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులకు వెలికితీస్తున్న ఓటీటీలను మనం మెచ్చుకుని తీరాలని అల్లు అర్జున్ పేర్కొన్నారు. భారతీయ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ.. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అని అన్నారు.
ఇవీ చదవండి:
- 'పుష్ప' సినిమా.. ఈ విషయాలు గమనించారా?
- భుజం ఎత్తడం వల్ల నాకు ఆ సమస్య వచ్చింది: అల్లు అర్జున్
- 'పుష్ప' కాదు మన సినిమా గెలవాలి: అల్లు అర్జున్
- Allu Arjun: రోడ్డు పక్కన హోటల్లో అల్లు అర్జున్..
- చిన్నారి కలను నిజం చేసిన అల్లు అర్జున్
- బాలీవుడ్ కాదు.. నా టార్గెట్ అదే: అల్లు అర్జున్
- Pushpa movie: 'పుష్ప' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.250 కోట్లు!