ETV Bharat / sitara

విజయ్ దేవరకొండ, అడివి శేష్​లా ఛాన్స్ రాలేదు: సిద్ధు - విజయ్ దేవరకొండ మూవీస్

DJ Tillu siddhu: 'డీజే టిల్లు'తో సక్సెస్​ అందుకున్న సిద్ధు.. తన కెరీర్​ గురించి మాట్లాడాడు. 'గుంటూరు టాకీస్​' పెద్దగా అవకాశాలు రాకపోవడం వల్లే గుర్తింపు రావడానికి ఇంత టైమ్​ పట్టిందని అన్నాడు.

dj tillu hero sidhu
సిద్ధు
author img

By

Published : Feb 18, 2022, 3:08 PM IST

DJ Tillu movie: సిద్ధు జొన్నలగడ్డ.. 'డీజే టిల్లు' చిత్రం హిట్‌ కావడం వల్ల టాలీవుడ్‌లో ఈ పేరు తెగ వినిపిస్తోంది. ఎక్కడా చూసినా 'డీజే టిల్లు' పాటలు మారుమోగిపోతున్నాయి. అయితే, అతడికి అంత సులువుగా ఈ పాపులారిటీ దక్కలేదు. 'గుంటూరు టాకీస్‌' చిత్రంతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు.. ఆ తర్వాత అడపాదడపా పాత్రలు చేసుకుంటూ వచ్చాడు. ఆ మధ్య వచ్చిన 'కృష్ణ అండ్‌ హీస్‌ లీలా', 'మా వింతగాథ వినుమా' చిత్రాలు ఫర్వాలేదనిపించాయి. ఎట్టకేలకు 'డీజే టిల్లు'తో సిద్ధుకు హిట్‌తోపాటు మంచి గుర్తింపు లభించింది. అయితే, తను హీరోగా నటించిన అన్ని చిత్రాలకు కథ, మాటలు సిద్ధునే రాసుకోవడం విశేషం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'డీజే టిల్లు' విజయం సాధించడం పట్ల సిద్ధు స్పందించాడు.

dj tillu movie
డీజే టిల్లు మూవీ

"ఈ రోజు పెన్ను పవర్‌ గెలిచింది. మిమ్మల్ని నవ్వించడానికి చాలా కష్టపడ్డాం. ఈ విజయం కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నా. అప్పట్లో 'గుంటూరు టాకీస్‌' చిత్రం విడుదలై హిట్‌ సాధించింది. కానీ, అప్పుడు నాకు 'పెళ్లి చూపులు' తర్వాత విజయ్‌ దేవరకొండకు, 'క్షణం' తర్వాత అడవి శేష్‌కు వచ్చినట్లు గొప్ప అవకాశాలు రాలేదు. అందుకే, ఇంత గ్యాప్‌ వచ్చింది. ఓ సారి నా ఫ్రెండ్‌ను నా కోసం ప్రచారం చేయమన్నా. కానీ, అది జరగలేదు. అప్పుడే నిర్ణయించుకున్నా ఎవరూ మనల్ని పట్టించుకోనప్పుడు మనమే ఒక సంచలనంగా మారాలి అని. అలా అనుకొని తీసిన గత రెండు చిత్రాలకు మిశ్రమ స్పందన వచ్చినా.. 'డీజే టిల్లు' బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది" అని సిద్ధు చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ఆడుతున్న ఈ చిత్రానికి విమల్‌కృష్ణ దర్శకత్వం వహించగా.. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రంలో సిద్ధుకు జంటగా నేహాశెట్టి నటించారు. ప్రిన్స్‌, బ్రహ్మాజీ, ప్రగతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీ చరణ్‌ పాకాల స్వరాలు సమకూర్చగా తమన్‌ నేపథ్యం సంగీతం అందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.