ETV Bharat / sitara

క్రికెటర్​తో దర్శకుడు శంకర్​ కుమార్తె వివాహం - ఐశ్వర్య శంకర్​ పెళ్లి

స్టార్​ డైరెక్టర్​ శంకర్​(Director Shankar) ఇంట పెళ్లిబాజాలు మోగనున్నాయి. ఆదివారం (జూన్​ 27) తమిళనాడు క్రికెటర్​ రోహిత్​ దామోదరన్(Rohit Damodaran)​తో ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం జరగనుంది. ​కరోనా ఆంక్షల నేపథ్యంలో ఇరు కుటుంబాల సమక్షంలో నిరాడంబరంగా వేడుకను నిర్వహించనున్నారని తెలుస్తోంది.

Director Shankar's daughter Aishwarya to marry TNPL cricketer
క్రికెటర్​తో దర్శకుడు శంకర్​ కుమార్తె వివాహం
author img

By

Published : Jun 27, 2021, 9:13 AM IST

Updated : Jun 27, 2021, 11:29 AM IST

ప్రముఖ దర్శకుడు శంకర్‌(Director Shankar) ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె ఐశ్యర్య(Aishwarya Shankar marriage)కు తమిళనాడు క్రికెటర్‌ రోహిత్‌ దామోదరన్‌తో ఆమె వివాహం నిశ్చయమైంది. ఆదివారం(జూన్​ 27) మహాబలిపురంలో ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం జరగనుంది.

లాక్​డౌన్​ ఆంక్షల కారణంగా ఇరు కుటుంబాల సమక్షంలో ఈ కల్యాణం జరగనుందని సమాచారం. కరోనా ఆంక్షలను సడలించిన తర్వాత రిసెప్షన్​ పెట్టి దేశవ్యాప్తంగా ప్రముఖులను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ వ్యాపారవేత్త దామోదరన్​ కుమారుడు రోహిత్​ దామోదరన్(Rohit Damodaran)​. తమిళనాడు ప్రీమియర్​ లీగ్​(TNPL)లోని మధురై పాంథర్స్​ క్రికెట్​ టీమ్​ కెప్టెన్​గా రోహిత్​ వ్యవహరిస్తున్నాడు. దర్శకుడు శంకర్​ పెద్ద కుమార్తె ఐశ్వర్య డాక్టర్​గా పనిచేస్తోంది.

దర్శకుడు శంకర్​.. ప్రస్తుతం 'భారతీయుడు 2'(Indian 2) చిత్రీకరిస్తున్నారు. ఆ తర్వాత మెగా పవర్​స్టార్ రామ్​చరణ్(RC15)​తో ఓ సినిమా చేస్తుండగా.. బాలీవుడ్​ హీరో రణ్​వీర్​ సింగ్​తో 'అపరిచితుడు'(Anniyan Remake) హిందీలో తెరకెక్కించనున్నారు.

ఇదీ చూడండి.. Acharya: ఆఖరి షెడ్యూల్​కు రంగం సిద్ధం

Last Updated : Jun 27, 2021, 11:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.