ETV Bharat / sitara

ఫేమ్​ వచ్చేవరకు సీక్రెట్​ 'రిలేషన్​'- ఆ స్టార్స్​ ఎవరంటే? - టొవినో థామస్

సినీ ఇండస్ట్రీలో బంధాలకు కొదువ లేదు. ఫేమ్​ వచ్చేంతవరకు మేము ఫలానా వారికి 'బంధువులం' అని చెప్పుకునే చాలా మంది నటీనటులున్నారు. అయితే సొంతంగా గుర్తింపు తెచ్చుకునే వరకు అప్పటికే ఇండస్ట్రీలో స్టార్స్​గా ఉన్న తమ రిలేటివ్ పేరుని బయటపెట్టని నటులు కూడా ఉన్నారు. వారి గురించే ఈ కథనం.

celebrity relatives
ప్రియమణి
author img

By

Published : Sep 10, 2021, 4:41 PM IST

కోలీవుడ్​లో చాలా సెలబ్రిటీ కుటుంబాలు ఉన్నాయి. అందులో ట్యాలెంట్​తో కొందరు భారీగా సక్సెస్ సాధిస్తున్నారు. అయితే తమకు ఓ నటుడితోనో, డైరెక్టర్​తోనో బంధం ఉందని ఫేమ్​ వచ్చేవరకు చెప్పుకోవడానికి చాలా మంది వెనుకాడరు.

కానీ కార్తీ లాంటి నటులు దీనికి భిన్నం. అతడు ప్రముఖ నటుడు​ శివ కుమార్ కుటుంబానికి చెందినా.. సూపర్​స్టార్​ సూర్యకు తమ్ముడైనా.. ఆ విషయం ఎక్కడా వెల్లడించలేదు. తన సినిమా 'పరుత్తివీరన్' (తెలుగులో 'మల్లిగాడు') హిట్​ సాధించిన తర్వాతే తన బ్యాక్​గ్రౌండ్​ గురించి వెల్లడించాడు. కార్తీలానే ఇండస్ట్రీలో ఉన్న మరి కొంతమంది నటులున్నారు. వారెవరంటే..

ఏఆర్​ రెహమాన్, భవానీ శ్రీ

celebrity relatives
ఏఆర్​ రెహమాన్, జీవీ ప్రకాష్, భవానీ శ్రీ

సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్​.. ఏఆర్​ రెహమాన్ మేనల్లుడని మనలో చాలా మందికి తెలుసు. ఇప్పుడు రెహమాన్ కుటుంబం నుంచే మరో సెలబ్రిటీ పుట్టుకొచ్చింది. ఆమె భవానీ శ్రీ. విజయ్ సేతుపతి నటించిన కా పె రణసింగం, పావకాథైగల్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. భవానీ శ్రీ.. జీవీ ప్రకాష్ సోదరి. వారిద్దరూ రెహమాన్ సోదరి ఏఆర్ రైహీనా, జి.వెంకటేశ్​ పిల్లలు.

ప్రశాంత్, విక్రమ్

celebrity relatives
ప్రశాంత్, విక్రమ్

నటుడు ప్రశాంత్, విక్రమ్​ కజిన్స్​ అవుతారు. విక్రమ్ వాళ్ల అమ్మ రాజేశ్వరీ, ప్రశాంత్ వాళ్ల నాన్న త్యాగరాజన్​కు సోదరి అవుతుంది. తమిళ ఇండస్ట్రీలో త్యాగరాజన్​ ప్రసిద్ధ నటుడు. 90ల చివర్లో, 2000లో ప్రశాంత్​ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 1990లో నటుడిగా అరంగేట్రం చేసిన చియాన్ విక్రమ్.. కోలీవుడ్​లో టాప్​ హీరోగా ఉన్నాడు.

దేవా, జై

celebrity relatives
జై, దేవా

మ్యూజిక్ డైరెక్టర్ దేవా, జర్నీ నటుడు జై కూడా బంధువులే. జైకి ఆయన అంకుల్​ అవుతారు. దేవా.. ఆయన కుమారుడు శ్రీకాంత్ దేవా.. తమిళ్​లో చాలా పాపులర్. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన జై.. కెరీర్​ తొలినాళ్లలో కీబోర్డిస్ట్​గా కూడా పనిచేశాడు.

డేనియల్ బాలాజీ, అథర్వా మురళి

celebrity relatives
డేనియల్ బాలాజీ, అథర్వా మురళి

యువ ప్రతిభావంతుడు అథర్వా మురళి, ప్రముఖ విలన్ డేనియల్ బాలాజీకి చుట్టరికం ఉంది. కన్నడ దర్శకుడు సిద్ధ లింగయ్య.. బాలాజీకి అంకుల్ అవుతారు. సిద్ధ లింగయ్య.. అథర్వకు తాత అవుతారు. అథర్వ వాళ్ల నాన్న కూడా నటుడే.

రమ్య కృష్ణ, చో రామస్వామి

celebrity relatives
రమ్య కృష్ణ, చో రామస్వామి

నటి రమ్యకృష్ణ, క్యారక్టర్ ఆర్టిర్, పొలిటికల్ సెటైరిస్ట్ చో రామస్వామి బంధువులే. ఆయనకు రమ్యకృష్ణ మేనకోడలు. చోనే తనకు స్ఫూర్తి అని, తమ కుటుంబానికి బలమని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

ప్రియమణి, విద్యాబాలన్

celebrity relatives
ప్రియమణి, విద్యాబాలన్

ఇటీవలే 'ఫ్యామిలీమ్యాన్​ 2'తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియమణి.. బాలీవుడ్ సూపర్​స్టార్ విద్యాబాలన్​కు దూరపుచుట్టం. ఇద్దరూ కజిన్స్ అవుతారు.

నివిన్ పౌలీ, టొవినో థామస్

celebrity relatives
నివిన్ పౌలీ, టొవినో థామస్

మాలీవుడ్​లో నివిన్ పౌలీ, టొవినో థామస్​ టాప్​ హీరోలు. వారికి దక్షిణాదిలో చాలా ఫేమ్​ ఉంది. 'ప్రేమమ్​'తో జాతీయ స్థాయిలో నివిన్​కు గుర్తింపు దక్కింది. 'ఎన్ను నింటే మొయిదీన్', 'వైరస్', 'లూసిఫర్' లాంటి చిత్రాలతో భారీ హిట్స్ ఇచ్చాడు టొవినో. కోలీవుడ్​లోనూ వారు సినిమాలు చేశారు. నివిన్ పిన్ని.. టొవినోకు అత్తమ్మ అవుతుంది.

ఏఆర్​ రెహమాన్, నటుడు రెహమాన్

celebrity relatives
ఏఆర్​ రెహమాన్, నటుడు రెహమాన్

తమిళ్, మలయాళంలో రెహమాన్​కు.. నటుడిగా మంచి పేరుంది. సంగీత దర్శకుడు రెహమాన్, ఆయన బంధువులవుతారు. నటుడు రెహమాన్ భార్య మెహెరున్నీసా, ఏఆర్ రెహమాన్ భార్య సైరా భాను సొంత అక్కాచెల్లెళ్లు. అంటే ఇద్దరూ తోడల్లుళ్లు అన్నమాట.

ఇదీ చూడండి: 'అన్నాత్తే' ఫస్ట్​లుక్ అదుర్స్.. 'ఖిలాడి' సాంగ్ వచ్చేసింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.