Cricketer Sreesanth Samantha: విజయ్ సేతుపతి, సమంత, నయనతారలు ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'కాతువాకుల రెండు కాదల్'. ఈ సినిమాలో క్రికెటర్ శ్రీశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపింది చిత్రబృందం. మహ్మద్ మోబీగా అతడిని పరిచయం చేస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ మూవీకి విఘ్నేశ్ దర్శకుడు. అనిరుధ్ రవిచందర్ సంగీత సమకూరుస్తున్నాడు.
![Cricketer Sreesanth Samantha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14427376_sreesanth.jpg)
Akshay kumar Prithviraj movie: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ నటించిన కొత్త సినిమాల్లో 'పృథ్వీరాజ్' ఒకటి. ఎట్టకేలకు ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేసుకుంది. జూన్ 10న రిలీజ్ కానున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఇందులో అక్షయ్‌తో పాటు మానుషీ చిల్లర్, సంజయ్ దత్, సోనూ సూద్ కీలక పాత్రల్లో నటించారు. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహించారు.
![prithviraj](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14427376_prithviraj.jpg)
Yamigautham new movie: యామీ గౌతమ్, అతుల్ కులకర్ణి, నేహా ధుపియా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ఏ థర్స్‌డే'. బేహ్‌జాద్ ఖంబాటా దర్శకత్వం వహించారు. ఈ సినిమా నేరుగా ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 17నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ను గురువారం విడుదల చేసింది. ఓ గురువారం జరిగే అనూహ్య సంఘటనల నేపథ్యంలో ఈ థ్రిల్లర్ చిత్రం రూపొందినట్టు తెలుస్తోంది. ప్లే స్కూల్ టీచర్ అయిన యామీ తన విద్యార్థుల్ని నిర్భంధించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే సన్నివేశాలు ఉత్కంఠ పెంచేలా ఉన్నాయి. టీచర్‌గా యామీ, పోలీసు ఆఫీసర్‌గా నేహాధుపియా అందరినీ ఆకట్టుకునేలా ఉన్నారు. రోనీ స్క్రూవాలా, ప్రేమ్‌నాథ్ రాజగోపాలన్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో డింపుల్ కపాడియా, కరణ్‌వీర్ శర్మ తదితరులు అతిథి పాత్రలు పోషించారు. ఈ సినిమాకి రోషన్ దలాల్ సంగీతమందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Madhuri Dixit new movie: బాలీవుడ్ అందాల భామ మాధురీ దీక్షిత్ నటించిన తొలి వెబ్‌సిరీస్ 'ది ఫేమ్ గేమ్' ఫిబ్రవరి 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో సంజయ్ కపూర్, మానవ్ కౌల్, సుహాసినిములె కూడా నటించారు. బీజాయ్ నంబీయార్ దర్శకత్వం వహించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: షూటింగ్లో శివకార్తికేయన్.. కంగన 'లాక్ అప్' ఫస్ట్‌లుక్