ETV Bharat / sitara

అభిమానం అతిక్రమిస్తే? ఇక అంతే సంగతులు! - పవన్​ కల్యాణ్ ఫ్యాన్స్

సెలెబ్రెటీని మెప్పించడానికి పచ్చబొట్టు పొడిపించుకోవడం, రక్తంతో లేఖ రాయడం, గుళ్లో పొర్లు దండాలు, ఇల్లొదిలి వచ్చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోరాటాలకు దిగడం.. ఇలాంటివి ఈమధ్యకాలంలో ఎన్నెన్నో. ఏంటీ మైకం? అంటే సెలబ్రిటీ వర్షిప్‌ సిండ్రోమ్‌ (సీడబ్ల్యూఎస్‌) అనేది సమాధానం. ఇదీ ఒక మానసిక రుగ్మతే అంటారు మానసిక నిపుణులు. యువత దీన్నుంచి బయట పడకపోతే చదువు, కెరీర్‌.. చివరికి జీవితమే చిత్తైపోతుందంటున్నారు.

celebrity worship syndrome
ఫ్యాన్​ సిండ్రోమ్
author img

By

Published : Jan 29, 2022, 1:11 PM IST

* అభిమాన హీరో ఓపెన్‌ టాప్‌ కారులో నిల్చొని అభివాదాలు చేస్తుంటే.. అతగాడి దృష్టిలో పడాలని కారు వెంట అరకిలోమీటరు పరుగెత్తాడో అభిమాని..

* కాళ్లు బొబ్బలెక్కినా అష్టకష్టాలు పడుతూ ఇష్టమైన నటుడ్ని కలవడానికి 900 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కాడో ఫ్యాన్‌..

* ఫేవరెట్‌ హీరోయిన్‌లా తీరైన ముక్కు, సొట్ట బుగ్గలు రావాలని ఎనిమిదిసార్లు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుందో అమ్మాయి...

అభిమానిస్తే తప్పులేదు.. అది హద్దులు దాటినప్పుడే వస్తుంది చిక్కంతా. సినిమా నటులు, క్రీడాకారులు, గాయకులు, రాజకీయ నాయకులకు మనదేశంలో వీరాభిమానులు ఎక్కువ. అందులో నూటికి తొంభైశాతం యువతే. నూనూగు మీసాల కౌమారం నుంచే ఈ ఆరాధన మొదలవుతుందంటాడు డా.లిక్‌ మెక్‌కచోయిన్‌. వయసు పెరుగుతున్నకొద్దీ అభిమానం ముదిరి.. నూటికి పద్దెనిమిది మందిలో వ్యసనం స్థాయికి వెళ్తుందంటాడు. ఈ అంశంపై నాలుగేళ్లు పరిశోధన చేశాడు డా.లిక్‌.. ఆ దశలో ఈ మత్తు ఏ స్థాయిలో ఉంటుందంటే.. తాము ఇష్టపడే సెలెబ్రెటీని ఎవరైనా పల్లెత్తు మాట అన్నా తట్టుకోలేరు. వాళ్ల కోసం ఏమైనా చేస్తారు. ఎంతదూరమైనా వెళ్తారు. వాళ్ల ప్రతి అడుగూ అపురూపంగానే కనిపిస్తుంది. పాట పాడినా, ఫైట్‌ చేసినా పరవశించి పోతారు. ఆ హీరో సినిమా హిట్‌ కొడితే తామే కోట్లు కూడబెట్టినంత సంబరపడతారు. వాళ్లింట్లో శుభకార్యమైతే వీళ్లు వేడుక చేసుకుంటారు. ఏదైనా విషాదం జరిగితే అన్నం తినడమే మానేస్తారు. ఆరాధ్యుడి తరపున సోషల్‌మీడియాలో ఉద్యమాలే చేస్తారు. ఎవరైనా ట్రోల్‌ చేస్తే వీధి పోరాటాలకైనా వెనుకాడరు. కొందరైతే.. తమకిష్టమైన హీరోహీరోయిన్లతో రొమాన్స్‌ చేస్తున్నట్టు ఊహల్లో తేలిపోతుంటారు. వాళ్లు మా సొంతమని భావిస్తారు. వారి దృష్టిలో పడాలనీ, మాట కలపాలనీ, సెల్ఫీ దిగాలనీ ఉవ్విళ్లూరతారు. పీసీల్లో వాల్‌పేపర్లు.. ఫేస్‌బుక్‌ కవర్‌ ఫొటోలు.. వాట్సప్‌ డీపీలు వారివేనని వేరే చెప్పాలా? ఇంకొందరైతే అభిమాన హీరో, హీరోయిన్లలా కనిపించడానికి కాస్మెటిక్‌ శస్త్రచికిత్సలకు సైతం వెళ్లిపోతుంటారు.

.
.

కనిపెట్టడమెలా?

ఇలా అతిగా ఆరాధించడం ఒకరకమైన మానసిక జబ్బే అంటారు సైకాలజిస్టు గీతా చల్లా. కానీ ఆ విషయం వీర విధేయులు ఒప్పుకోరు. వీళ్లు తమదైన ఊహా ప్రపంచంలో ఉంటారు. ఆత్మన్యూనతా భావం ఎక్కువగా ఉన్నవారు సైతం.. తమ అస్థిత్వాన్ని కోల్పోయి నచ్చిన హీరో, హీరోయిన్లలో తమని తాము చూసుకుంటారు. ఈ మైకంలో పడి వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నా పట్టించుకోరు. కాలేజీ కుర్రాళ్లైతే చదువుపై సరిగా దృష్టి పెట్టలేరు. కెరీర్‌పై ప్రభావం పడుతుంది. పెళ్లైన వాళ్లు బాధ్యతలు పట్టించుకోకుంటే సంసారంలో కలతలు వస్తుంటాయి. ఇతరులతో గొడవల కారణంగా కేసులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. అన్నింటికీ మించి ఒక వ్యక్తిలో సహజంగా ఉండాల్సిన భావోద్వేగాలు కనుమరుగవుతాయి. బంధువులు, ఇంట్లోవాళ్లకు ఏదైనా నష్టం జరిగితే పెద్దగా స్పందించరుగానీ అభిమాన సెలెబ్రెటీకి ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు.

బయట పడదాం..

.
.

అందంగా ఉండే చందమామను ఆరాధించవచ్చు.. ఫొటోలు తీసుకోవచ్చు. కానీ నిచ్చెన వేసి అందుకోవాలనుకోవడమే పిచ్చి. ప్రతి మనిషికీ రెండు జీవితాలుంటాయి.. వ్యక్తిగతం, వృత్తిగతం. తారలకైనా అంతే. అభిమానులు వారి వ్యక్తిగత జీవితాలనూ పట్టించుకోవడమే సీడబ్ల్యూఎస్‌. ఈమధ్య ఓ సినీ జంట విడాకులు తీసుకుంటే ఆ బాధను తట్టుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్లినవాళ్లను చూశాను. అభిమానించడం, ఆరాధించడం వరకు ఫరవాలేదు. వాళ్లని కలవాలి.. ఫొటోలు దిగాలి.. మెప్పించాలనే అతి ఉత్సాహంలో పడి తమ వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతుంటారు. ఈ మత్తు నుంచి బయట పడాలంటే తారల్ని కేవలం గుడ్డిగా అభిమానించకుండా ఓ రోల్‌మోడల్‌లా తీసుకోవాలి. వాళ్లలోని నిరాడంబరత, కష్టపడేతత్వంలాంటి మంచి లక్షణాలు తీసుకొని ఆచరించాలి. యుక్త వయసు పిల్లల్ని సీడబ్ల్యూఎస్‌ నుంచి బయట పడేయడంలో తల్లిదండ్రులు, స్నేహితుల పాత్ర కూడా కీలకమే. పిల్లలు ఎవరిపై అయినా విపరీతమైన అభిమానం చూపిస్తుంటే.. ఆ ధ్యాసలో పడి చదువు, కెరీర్‌పై అశ్రద్ధ చూపితే దానివల్ల కలిగే నష్టాలేంటో విడమరిచి చెప్పాలి. వాళ్లకిష్టమైన ఇతర వ్యాపకాల ద్వారా చిన్నచిన్న ఆనందాలు ఇస్తూ క్రమక్రమంగా ఆ మైకం నుంచి బయట పడేయాలి. ఈ క్రమంలో వాళ్లు స్వీయ అవగాహన చెందేలా చూడొచ్చు. దీనికోసం అవసరమైతే మానసిక నిపుణుల సాయం తీసుకోవచ్చు. ఈ ఊబి నుంచి తమంత తాముగా బయటపడాలి అనుకునేవాళ్లు ముందుగా ఆ సెలెబ్రెటీకి సంబంధించిన విషయాలకు దూరంగా ఉండాలి. సామాజిక మాధ్యమాల్లో వారిని అనుసరించడం మానేయాలి. వాకింగ్‌, ట్రెక్కింగ్‌లాంటి వేరే వ్యాపకాలు అలవాటు చేసుకోవచ్చు. యోగా, ధ్యానం చేసినా ఈ విపరీత భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. ఆలోచనలను తరచూ సన్నిహితులు, స్నేహితులతో పంచుకుంటే మంచి సూచనలు పొందొచ్చు. యువతలో సహజంగానే విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. దాన్ని సరైన దారిలో మళ్లిస్తే అద్భుతాలు చేయొచ్చు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.