ETV Bharat / sitara

బాలీవుడ్​లో హీరోయిజం కరవైంది: సల్మాన్​ ఖాన్​

Salman Khan: దక్షిణాది చిత్రాలు బాలీవుడ్​లో అదరగొడుతున్న వేళ, హిందీ సినిమాలు సౌత్​లో ఎందుకు ఆడటం లేదని ప్రశ్నించారు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. దక్షిణాది సినిమాల్లోని హీరోయిజమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోందని అన్నారు. అదే బాలీవుడ్​లో కరవైందని చెప్పారు.

salman khan bollywood
ram charan rrr
author img

By

Published : Mar 29, 2022, 10:11 AM IST

Salman Khan: దక్షిణాది చిత్రాల్లో ఉండే హీరోయిజమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోందని అన్నారు బాలీవుడ్​ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. ఆ హీరోయిజమే ప్రస్తుత హిందీ సినిమాల్లో కరవైంది చెప్పారు. 'వాంటెడ్', 'దబాంగ్'​ వంటి అనేక మాస్​ మసాల చిత్రాలతో అలరించిన సల్మాన్​.. ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్​ అకాడమీ (ఐఫా) ప్రెస్​ కాన్ఫరెన్స్​లో సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు.

salman khan bollywood
'ఐఫా'లో సల్మాన్

"బాలీవుడ్​తో పాటు దక్షిణాది సినిమాల్లో హీరోయిజంపై నమ్మకం ఉంచుతారు. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకో హీరో ఉంటాడు. కానీ, ఇక్కడ (బీటౌన్​) ఒకరిద్దరు మినహా హీరోయిజం ఉన్న సినిమాలు తీయడంలేదు. అలాంటి సినిమాలు మూస అని భావిస్తున్నారు. అయితే హీరోయిజంతో పాటు భావోద్వేగాలుండటం చాలా ముఖ్యం."

-సల్మాన్ ఖాన్, బాలీవుడ్ హీరో

ఈ క్రమంలోనే దక్షిణాది రచయితలు, దర్శకుల.. ప్రతిభ, విజన్​ను కొనియాడారు సల్మాన్. దక్షిణాది చిత్రాలు హిందీలో రీమేక్​ అవుతున్న ట్రెండ్​ మారాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. "మన కథలను కూడా వారు తీసుకునే రోజు రావాలి. దక్షిణాది రచయితలు చాలా కష్టపడతారు. అక్కడి దర్శకులు తీసే కాన్సెప్ట్​ సినిమాలకూ ఆదరణ ఉంది" అని సల్మాన్ చెప్పారు.

salman khan bollywood
'ఆర్​ఆర్​ఆర్​'

ప్రస్తుతం 'టైగర్​ 3'లో నటిస్తున్న సల్మాన్​.. మెగాస్టార్​ చిరంజీవి 'గాడ్​ఫాదర్'​, షారుక్​ 'పఠాన్'​ చిత్రాల్లో అతిథి పాత్రల్లో కనపించనున్నారు. ఇటీవలే 'గాడ్​ఫాదర్'​లో కీలక షెడ్యూల్​ను కూడా పూర్తి చేశారు సల్మాన్.

salman khan bollywood
'గాడ్​ఫాదర్' టీమ్​తో సల్మాన్​

చరణ్​ పట్ల గర్వంగా ఉంది: "చిరంజీవి నాకు చాలా ఏళ్లుగా తెలుసు. ఆయనతో పని చేయడం మంచి అనుభవం. చరణ్​ కూడా నాకు స్నేహితుడే. 'ఆర్​ఆర్​ఆర్'​లో అద్భుతంగా నటించాడు. చరణ్​ పట్ల గర్వంగా ఉంది. అయితే వారి సినిమాలు ఇక్కడ నడుస్తాయి గానీ మనవి (హిందీ) అక్కడ ఎందుకని ఆడవు?" అని సల్మాన్ ప్రశ్నించారు.

ఇదీ చూడండి: 'గాడ్​ఫాదర్'​ సల్మాన్​ షెడ్యూల్​ పూర్తి​.. 'బజరంగి భాయిజాన్'​ సీక్వెల్​ అప్డేట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.