ETV Bharat / sitara

ఆ ఫేస్​బుక్​ ఫొటోయే శ్రద్ధాను హీరోయిన్​ చేసింది! - బాలీవుడ్ స్టార్​ హీరోయిన్ శ్రద్ధాకపూర్

బాలీవుడ్ స్టార్​ హీరోయిన్ శ్రద్ధాకపూర్ నేడు​ 32 వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తన గురించి ప్రత్యేక కథనం.

sraddha kapoor
http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/02-March-2020/6272926_59.jpg
author img

By

Published : Mar 3, 2020, 5:46 AM IST

Updated : Mar 3, 2020, 8:31 PM IST

బాలీవుడ్​ కథానాయిక శ్రద్ధాకపూర్​... అనతి కాలంలోనే స్టార్​డమ్​ను సంపాదించుకున్న బ్యూటీ​. తల్లిదండ్రుల నుంచి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొన్న ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. నేడు తన పుట్టినరోజు సందర్భంగా ఆమె సినీ ప్రయాణంపై ఓ లుక్కేద్దాం.

ఆ ప్రభావం..

ముంబయిలో 1987 మార్చి 3న జన్మించింది. తండ్రి శక్తికపూర్‌. హిందీలో ప్రముఖ నటుడు. తల్లి శివంగి కొల్లాపూర్‌ కపూర్‌. ఆమె కూడా ఓ నటి. అన్నయ్య సిద్దాంత్‌ కపూర్‌ కూడా సినిమాల్లోనే నటిస్తున్నాడు.

sraddha kapoor
శ్రద్ధాకపూర్​

పద్మిని కపూర్, లతా మంగేష్కర్, ఆశాభోంస్లే తదితర సినీప్రముఖులంతా శ్రద్ధకి దగ్గరి బందువులు, ఆ ప్రభావం శ్రద్ధపై ఎంతో ఉంది. దీంతో చిన్నప్పుడే తల్లిదండ్రుల అడుగు జాడల్లో నడవాలని నిర్ణయించుకుంది. జమ్నాబాయి నర్సీ స్కూల్, అమెరికన్‌ స్కూల్‌ ఆఫ్‌ ముంబయిల్లో ప్రాథమిక విద్యని పూర్తి చేసిన శ్రద్ధ ఆ తరువాత నటనని చదివేందుకు బోస్టన్‌ యూనీవర్సిటీ వెళ్లింది. అక్కడ నటనకు సంబంధించిన పలు కోర్సులను చేసి భారత్​కు తిరిగొచ్చింది.

ఫేస్‌బుక్‌ ఫొటోలతో...

అవకాశాల కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. ఫేస్‌బుక్‌లో ఫొటోలని చూసి అంబికాహిందూజా అనే నిర్మాత నుంచి పిలుపందుకుంది శ్రద్ధాకపూర్‌. 'తీన్‌పత్తి'లో కథానాయికగా ఎంపికైంది. తొలి ప్రయత్నంలోనే అబితాబ్‌ బచ్చన్, మాధవన్, బెన్‌ కింగ్‌స్లే లాంటి అగ్ర నటులతో కలిసి నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. అందులో ఒక కళాశాల విద్యార్థినిగా నటించింది శ్రద్ధ. అయితే ఆ చిత్రం బాక్సాఫీసు దగ్గర బోల్తా పడింది. శ్రద్ధాకపూర్‌కి మాత్రం నటిగా చక్కటి గుర్తింపు లభించింది. పలువురు సినీ విమర్శకులు శ్రద్ధ నటనని ప్రశంసించారు.

sraddha kapoor
శ్రద్ధాకపూర్​

అదే ఫలితం..

తొలి చిత్రం తర్వాత శ్రద్ధాకపూర్‌ని మరిన్ని అవకాశాలు వరించాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ శ్రద్ధాకపూర్‌తో మూడు సినిమాల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ ఒప్పందంలో భాగంగా తొలి చిత్రం 'లవ్‌ కా ఎండ్‌' అనే సినిమాని తీసింది. అయితే మరోసారి తొలి చిత్రంలాంటి ఫలితమే ఎదురైంది. సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. శ్రద్ధ నటన గురించి ప్రశంసలు వెల్లువెత్తాయి. తొలి చిత్రంతో పోలిస్తే మరింత ఆత్మవిశ్వాసంతో నటించిందని పలువురు అభినందించారు.

ఒప్పందం కాదని...

కాసింత అనుభవం రాగానే ఆచితూచి కథలను ఎంచుకొనే ప్రయత్నం చేసింది శ్రద్ధాకపూర్‌. యశ్‌రాజ్‌ సంస్థతో కుదర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకొని మరీ 'ఆషికి 2' చేసింది. విజయవంతమైన 'ఆషికి'కి కొనసాగింపుగా ఇది తెరకెక్కింది. ఈసారి శ్రద్ధ నమ్మకం వమ్ముకాలేదు. భారీ కలెక్షన్‌ రాబట్టుకొని ఓ మ్యూజికల్‌ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా విజయం అవడం వల్ల బాలీవుడ్‌ అంతా శ్రద్ధాకూర్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొంది.

sraddha kapoor
శ్రద్ధాకపూర్​

తళుక్కు తార

కథానాయికగానే కాకుండా.. ప్రత్యేకపాత్రలవైపు కూడా అడుగులేసింది శ్రద్ధాకపూర్‌. అమీర్‌ఖాన్‌ అల్లుడు ఇమ్రాన్‌ఖాన్‌తో కలిసి 'గోరి తేరా ప్యార్‌ మే'లో ప్రత్యేకపాత్ర పోషించింది. తెరపై తళుక్కుమన్నది కాసేపే అయినా... శ్రద్ధకి ఈ సినిమా మేలే చేసింది. ఇమ్రాన్‌ఖాన్‌లాంటి కథానాయకుడితో కలిసి నటించి అందరి దృష్టినీ మరోసారి ఆకర్షించింది.

తరువాత వరుసగా 'ఏక్‌ విలన్‌', షాహిద్‌ కపూర్‌తో కలిసి 'హైదర్‌'లో చేసింది. ఇంకా వరుసగా 'అంగ్లీ', 'ఏబిసీడీ2', 'బాఘి', 'ఏ ప్లైయింగ్‌ జెట్‌', 'రాక్‌ ఆన్‌', 'ఓకే జాను', 'హాఫ్‌ గర్లఫ్రెండ్‌', 'హసీనా పార్కర్‌', 'స్ట్రీట్‌ డ్యాన్సర్‌', 'చిచ్చోర్‌' స్ట్రీట్‌ డ్యాన్సర్‌ 3డీ', సినిమాల్లో నటించింది. తెలుగు నిర్మాతలు రాజ్‌ నిడమూరు, కృష్ణ డి.కె. నిర్మాతలుగా తెరకెక్కిన చిత్రం 'స్త్రీ'లో అలరించింది .తెలుగులో ప్రభాస్‌తో కలిసి పాన్​ ఇండియా సినిమాగా తెరకెక్కిన 'సాహో'లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

sraddha kapoor
శ్రద్ధాకపూర్​

ఆమె మనసులోని మాటలు మరిన్ని...

  • కళ్ళతో భావాలు పలికించడం అమ్మనుంచి నేర్చుకున్నా, నవ్వుమాత్రం నా సొంత ఆస్తి.
  • నువ్వు ప్రాక్టికలా? రొమాంటిక్‌ పర్సనా? అని అడుగుతుంటారు చాలామంది. నేను మాత్రం రెండూ అని చెబుతుంటా.
  • మనం ఎక్కడ నుంచి వచ్చామన్నది ముఖ్యం కాదు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా ఎవరికి తగ్గ కష్టాలు వాళ్లకు ఉంటాయి. శక్తికపూర్‌ కూతురినే అయినా... నా సొంతశైలి కూడా చూపించినప్పుడే రాగలగుతాను.
  • నా జీవితాన్ని మలుపుతిప్పిన విషయం ఏదైనా ఉందంటే అది బోస్టన్‌కి వెళ్లి యాక్టింగ్‌కి సంబంధించి చదుకుకోవడమే.
  • నా తొలి చిత్రం ‘తీన్‌పత్తి’కి ప్రేక్షకుల నుంచి లభించిన స్పందన చూసినప్పుడు చాలా బాధగా అనిపించింది.
  • 'ఆషికి 2' నటించేటప్పుడు ‘ఆషికి’ని చూశావా అని అడిగారు. నేను ఆ సినిమా చూడనని దర్శకుడితో చెప్పా. ఇప్పటికీ చూడలేదు.
  • షాపింగ్‌ అంటే నాకు చాలా ఇష్టం. లండన్, ప్యారిస్‌ నగరాల్లోని బొటిక్‌ స్టోర్లలో వస్తువులు కొనుగోలు చేయడమంటే నాకు భలే సరదా.
  • వారానికి మూడు సార్లు జిమ్‌కి వెళుతుంటాను. అందం పేరుతో ఆహార నియమాలు మాత్రం పాటించడం నాకు అస్సలు నచ్చదు. ఏం ఇష్టమైతే అవితినేస్తా. ఎంత తిన్నా బరువు మాత్రం పెరగను.
    sraddha kapoor
    శ్రద్ధాకపూర్​

ఇదీ చూడండి.. పవర్​ స్టారూ.. ట్రెండింగ్​లో హుషారు

Last Updated : Mar 3, 2020, 8:31 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.