ETV Bharat / sitara

Hollywood movie: హాలీవుడ్​ ఛాన్స్​కు నో చెప్పిన మన స్టార్స్ - aishwarya rai bachchan hollywood movies

బ్లాక్​బస్టర్లుగా నిలిచిన హాలీవుడ్​లోని కొన్ని​ సినిమాల్లో మన దేశానికి చెందిన స్టార్స్ కొందరు నటించాలి. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల.. ఇతర కారణాల వల్ల ఆ ఛాన్స్​లకు నో చెప్పేశారు. వాళ్ల గురించే ఈ ప్రత్యేక కథనం.

Bollywood actors who rejected roles in major Hollywood films
మూవీ స్టోరీ
author img

By

Published : Sep 24, 2021, 10:00 AM IST

టిక్​టాక్ వీడియోలు చేసేవాడికి టీవీలో అవకాశమొస్తే ఎగిరి గంతేస్తాడు. టీవీల్లో చేసేవాడికి సినిమాల్లో ఛాన్స్ ఇస్తే ఉబ్బితబ్బిబ్బైపోతాడు. తెలుగులో నటిస్తున్నవాడికి బాలీవుడ్​లో ఆఫర్​ వస్తే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పేస్తాడు. ప్రపంచంలోనే పెద్ద ఇండస్ట్రీ హాలీవుడ్​లో అవకాశం వస్తే ఇంకేమైనా ఉందా? నటీనటులు ఎవరైనా అస్సలు భూమ్మీద నిలబడరేమో!

కానీ బాలీవుడ్​కు చెందిన కొందరు స్టార్స్ మాత్రం హాలీవుడ్​లో ఛాన్స్ వస్తే చేయలేమని చెప్పేశారు. పలు కారణాలతో ఆఫర్లను తిరస్కరించారు. ఇంతకీ వాళ్లెవరు? ఎందుకు వద్దన్నారు?

1.షారుక్ ఖాన్

ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న 'స్లమ్​డాగ్ మిలియనీర్'లోని షో హోస్ట్​ కోసం తొలుత షారుక్​ను(shahrukh khan movie) ఎంపిక చేశారు. నటించేందుకు గ్రీన్ సిగ్నల్​ ఇచ్చి, రోల్​ కోసం రిహార్సిల్స్ కూడా చేసిన షారుక్.. కారణం చెప్పకుండానే సినిమా నుంచి తప్పుకొన్నాడు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఆఫర్​ వదులుకోవడానికి గల కారణాన్ని చెప్పాడు.

shahrukh khan
షారుక్ ఖాన్

"ఆ హోస్ట్​ పాత్ర చీటింగ్ చేస్తాడు. ఆ తరహా షో ఇంతకు ముందే చేశాను. మళ్లీ అదే చేశానని ప్రేక్షకులు ఫీల్ అవుతారు. అందుకే ఆ రోల్ చేయలేదు" అని షారుక్ చెప్పారు.

2.దీపికా పదుకొణె

హాలీవుడ్ స్టార్ విన్ డీజిల్​తో(vin diesel movies) కలిసి 'XXX: ద రిటర్న్ ఆఫ్ జెండర్ కేజ్' సినిమాలో నటించింది దీపికా పదుకొణె(deepika padukone age). ఆ హీరో చేస్తున్న 'ఫాస్ట్ అండ్ ఫూర్యియస్' సిరీస్​లోని ఓ సినిమా కోసం దీపికను అడిగారు. కానీ బాలీవుడ్​లో అప్పటికే చేస్తున్న ప్రాజెక్టుల కారణంగా హాలీవుడ్​ ఛాన్స్​కు నో చెప్పేసింది. అయితే ఈ విషయంలో తానేమి బాధపడట్లేదని ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

deepika padukone
దీపికా పదుకొణె

3.ఐశ్వర్యా రాయ్

హాలీవుడ్​లో అప్పటికే ద మిస్ట్రస్ ఆఫ్ స్పైసెస్, ద లాస్ట్ లెజియన్, పింక్ పాంథర్ 2 సినిమాలు చేసిన ఐశ్వర్యారాయ్(aishwarya rai bachchan daughter).. భారీ బడ్జెట్​ చిత్రం 'ట్రాయ్'లో అవకాశాన్ని వదులుకుంది. ఆ సినిమా షూటింగ్​ విదేశాల్లో ఎక్కువ రోజులు ఉండటం, మన సినిమాలు కూడా చేయాల్సి ఉండటం వల్లే ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నానని ఐష్ చెప్పింది.

aishwarya rai bachchan
ఐశ్వర్యరాయ్

4.గోవింద

బాలీవుడ్​లో 90ల్లో కామెడీ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు గోవింద(govinda age). తనదైన మార్క్​ క్రియేట్ చేసి ఈ నటుడు.. ఎన్నో సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రలు చేసి అలరించారు. గతంలో టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. జేమ్స్ కామెరూన్ కలల ప్రాజెక్టు 'అవతార్'లో తనకు ఛాన్స్ వచ్చిన విషయాన్ని చెప్పారు. కానీ అందులో నటించలేదని అన్నారు.

govinda
గోవింద

5.నసీరుద్దీన్ షా

'హ్యారీపోటర్' మూవీ సిరీస్​ చూసుంటే 'డంబెల్​డోర్' క్యారెక్టర్​ కచ్చితంగా గుర్తుంటుంది. అయితే తొలిరెండు భాగాలు తర్వాత ఆయన మృతిచెందారు. దీంతో ఆ పాత్ర కోసం హిందీ నటుడు నసీరుద్దీన్​ షాను(naseeruddin shah movies) ఆడిషన్ ఇవ్వమని చెప్పారు. కానీ ఆయన దానిపై పెద్దగా ఆసక్తి చూపలేదట. ఈ విషయాన్ని నసీరుద్దీన్, గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

naseeruddin shah
నసీరుద్దీన్ షా

6. ఇర్ఫాన్ ఖాన్

ఆస్కార్ అవార్డులు వచ్చినవి సహా పలు హాలీవుడ్​ సినిమాల్లో నటించిన ఇర్ఫాన్ ఖాన్(irrfan khan movies).. మరికొన్ని అవకాశాలకు నో చెప్పారు. తన పాత్రకు అంతగా ప్రాధాన్యం లేనందు వల్లే నో చెప్పాల్సి వచ్చిందని ఆయన అన్నారు. అయితే అగ్రిమెంట్​ కుదరకపోవడం వల్ల 'ఇంటర్​స్టెల్లార్'(interstellar meaning), 'బాడీ ఆఫ్ లైస్', 'ద మార్షియన్' సినిమాలు ఇర్ఫాన్​ నుంచి చేజారాయని హిందుస్థాన్ టైమ్స్ గతంలో పేర్కొంది.

irrfan khan movies
ఇర్ఫాన్ ఖాన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.