ETV Bharat / sitara

'రాధేశ్యామ్'​కు బిగ్​బీ వాయిస్​ఓవర్​.. రిలీజ్​ డేట్స్​తో సూర్య, అడవిశేష్​ - రాధేశ్యామ్​ అమితాబ్​ బచ్చన్​

Cinema Updates: కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో ప్రభాస్​ 'రాధేశ్యామ్'​, అడవి శేష్ 'మేజర్'​, సూర్య 'ఈటీ' చిత్రాల సంగతులు ఉన్నాయి.

Prabhas Radhe Shyam
ప్రభాస్​ రాధేశ్యామ్​
author img

By

Published : Feb 22, 2022, 12:02 PM IST

Updated : Feb 22, 2022, 1:22 PM IST

Adivi Sesh Major release date: అడివి శేష్‌ కథానాయకుడిగా శశి కిరణ్‌ తిక్కా తెరకెక్కిస్తున్న బహుభాషా చిత్రం 'మేజర్‌'. వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా కొత్త రిలీజ్​ డేట్​ను ఇటీవలే ప్రకటించారు మేకర్స్​. తెలుగు, హిందీ, మలయాళంలో చిత్రాన్ని మే 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ తేదీలో ఎలాంటి మార్పు లేదని మరోసారి స్పష్టం చేసింది చిత్రబృందం. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ చిన్న గ్లింప్స్​ను రిలీజ్​ చేసింది.

ET Suriya release date: 'ఆకాశమే హద్దురా', 'జై భీమ్‌' చిత్రాలతో హీరో సూర్య.. ఓటీటీ వేదికగా వరుస విజయాలు అందుకున్నారు. ఇప్పుడు 'ఈటీ'తో వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మార్చి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్​ కానున్నట్లు తెలిపారు మేకర్స్​. ఇందులో ప్రియాంక మోహన్​ హీరోయిన్​గా నటించింది.

Prabhas Amitabbachan: ప్రభాస్​ నటించిన 'రాధేశ్యామ్'​ హిందీ వెర్షన్​కు బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్​ వాయిస్​ ఓవర్​ ఇచ్చారు. ఈ విషయాన్ని తెలియజేసిన చిత్రబృందం బిగ్​బీకి కృతజ్ఞతలు తెలిపింది. ఈ మూవీ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్​గా నటించింది.

Rana brother hero: ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు తనయుడు, నటుడు రానా సోదరుడు అభిరామ్‌ దగ్గుబాటి వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. మంగళవారం తేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు, ప్రీలుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు ‘అహింస’ అనే పేరు పెట్టారు. ‘అహింసా పరమో ధర్మః, ధర్మహింసా తధైవచ’ అంటూ సురేశ్‌ ప్రొడక్షన్స్‌ ప్రీలుక్‌ను విడుదల చేసింది. ముఖానికి గోనె సంచి కట్టి ఉండగా, రక్తమోడుతూ అభిరామ్‌ కనిపించాడు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ‘అహింస’కి ఆర్పీ పట్నాయక్‌ సంగీత దర్శకుడు.

rana
రానా సోదరుడు అభిరామ్‌ దగ్గుబాటి వెండితెరకు పరిచయం

ఇదీ చూడండి: బుడ్డోడి బర్త్​డే సెలబ్రేషన్స్​ .. ఫ్యామిలీతో జాయ్​ఫుల్​గా సైఫ్​

Last Updated : Feb 22, 2022, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.