ETV Bharat / sitara

పీపీఈ కిట్లతో అమితాబ్ ​'కేబీసీ' షూటింగ్​ ప్రారంభం! - amitab latest movies

ప్రఖ్యాత టీవీ ​షో కేబీసీ 12వ ఎడిషన్​ షూటింగ్​ను ప్రారంభించారు బాలీవుడ్​ బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్​మీడియాలో పోస్ట్​ చేశారు.

KBC
అమితాబ్​
author img

By

Published : Aug 24, 2020, 11:48 AM IST

ఇటీవలే కరోనా బారిన పడ్డ బాలీవుడ్​ బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​.. అలా కోలుకున్నారో లేదో షూటింగ్​ పనుల్లో బిజీ అయిపోయారు. సోమవారం ప్రముఖ టెలివిజన్​ క్విజ్​ గేమ్​ షో 'కౌన్ బనేగా కరోడ్​పతి' చిత్రీకరణ ప్రారంభించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే సెట్స్​కు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకుంటూ.. "పీపీఈ కిట్లు ధరించి తిరిగి పని ప్రారంభించా. 2000 సంవత్సరంలో మొదలైన ఈ గేమ్​ షోకు ఇప్పుడు 20 ఏళ్లు. చాలా ఆశ్చర్యంగా ఉంది" అని అమితాబ్​ రాసుకొచ్చారు.

దేశవ్యాప్తంగా కేబీసీకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. 2000 సంవత్సరంలో ప్రారంభించిన ఈ కార్యక్రమం.. ఇప్పటి వరకు 11 సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 12వ ఎడిషన్ నిర్మాణ దశలో ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.