ETV Bharat / sitara

'ఖుషి'లో పవన్ భూమికను​ నిజంగా అలా చూడలేదు! - పవన్​కల్యాణ్ తాజా వార్తలు

'ఖుషి' సినిమాలో మీకు గుర్తున్న సన్నివేశం ఏంటంటే? టక్కున గుర్తుచ్చేది పవన్-భూమికల రొమాంటిక్ సీన్. అయితే మీరు ఊహించినట్లు దానిని చిత్రీకరించలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే?

Behind   Pawankalyan bhoomika waist scene in khusi is an interesting story
ఖుషీ
author img

By

Published : May 5, 2020, 7:59 PM IST

పలు సినిమాల్లో సన్నివేశాలు కొంతకాలం గుర్తుంటాయి. మరికొన్ని చిత్రాల్లోని సీన్స్ ఎప్పటికీ మర్చిపోలేనివిగా ఉంటాయి. అలాంటిదే 'ఖుషి'లోని పవన్​కల్యాణ్​, భూమిక నడుమను చూసే సన్నివేశం. ఇప్పటికీ ప్రేక్షకులు దీని గురించి మాట్లాడుకుంటున్నారంటే.. దానిబట్టి అర్థం చేసుకోవచ్చు. దానికున్న సత్తా ఏమిటో?. అయితే ఈ రొమాంటిక్‌ సీన్​ను మీరనుకున్నట్లు చిత్రీకరించలేదు. దాని వెనుక ఓ ఆసక్తికర కథ ఉంది.

నిజానికి తెరపై అంత చక్కగా పండిన ఆ సన్నివేశం వెనుక పవన్‌ అత్యద్భుతమైన నటన దాగి ఉంది. పవన్‌ భూమిక నడుమును చూసే సన్నివేశాలను ఆ సమయంలో అతడు ముఖంలో పలికిన హావభావాలు చూస్తే నిజంగా ఆమెను పవన్‌ ఎదురుగా కూర్చోబెట్టి ఆ సన్నివేశం చిత్రీకరించారేమో అనిపిస్తుంది. వాస్తవమేంటంటే పవన్‌, భూమికల సీన్స్​ను వేరువేరుగా తీశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

చిత్ర దర్శకుడు ఎస్​జే సూర్య... పవన్‌ను ఓ బల్లపై కూర్చోబెట్టి ఎదురుగా భూమిక ఉన్నట్లు, ఆమెను చాటుగా గమనిస్తున్నట్లుగా చేసి చూపమన్నారు. అలా చిత్రీకరించిన‌ సన్నివేశాన్నే తర్వాత భూమిక సీన్స్​తో కలిపి చూపించారు. అంతేకాని మనం ఊహించినట్లు జరగలేదు. తెరపై మాత్రం ఆది చూస్తున్నప్పుడు ఎంతో వాస్తవికంగా కనిపిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.