ETV Bharat / sitara

దసరా కానుకగా బాలయ్య 'నర్తనశాల' విడుదల - Narthanashala release

నందమూరి బాలకృష్ణ దర్శకత్వంలో 'నర్తనశాల' అనే చిత్రం తెరకెక్కింది. అయితే ఈ సినిమా విడుదల అనివార్య కారణాల వల్ల నిలిచిపోయింది. తాజాగా అప్పుడు చిత్రీకరించిన సన్నివేశాలను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు బాలయ్య.

Balakrishna want to Release Narthanashala short video on Dussehra
దసరా కానుకగా బాలయ్య 'నర్తనశాల' విడుదల
author img

By

Published : Oct 19, 2020, 4:09 PM IST

Updated : Oct 19, 2020, 4:17 PM IST

నందమూరి బాలకృష్ణ గతంలో 'నర్తనశాల' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా షూటింగ్ అనివార్య కారణాల వల్ల నిలిచిపోయింది. తాజాగా ఇందుకు సంబంధించి చిత్రీకరించిన సన్నివేశాలను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు బాలయ్య. దసరా కానుకగా 17 నిమిషాల వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.

"నాకు అత్యంత ఇష్టమైన చిత్రం నాన్నగారి 'నర్తనశాల'. ఆ చిత్రాన్ని నా దర్శకత్వంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎంతో కాలంగా మీరు ఆ చిత్రం కోసం చిత్రీకరించిన సన్నివేశాలను చూడాలన్న ఆసక్తిని చూపిస్తున్నారు. మీ అందరి కోరికపై ఈ 'నర్తనశాల' చిత్రానికి సంబంధించి 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను ఈ విజయదశమి కానుకగా 'ఎన్ బి కె థియేటర్'లో శ్రేయాస్ ఈటీ ద్వారా విడుదల చేయడం జరుగుతుంది. అర్జునుడిగా నేను, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు గారు కనిపిస్తాము. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్​కు ఉపయోగించడానికి నిర్ణయించుకున్నా. ఎన్నాళ్ల నుంచో 'నర్తనశాల' సన్నివేశాలను చూడాలన్న మీ కోరిక ఈ నెల 24 న నెరవేరబోతోంది" అని బాలయ్య తెలిపారు.

Balakrishna
బాలయ్య పోస్ట్

Last Updated : Oct 19, 2020, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.