ETV Bharat / sitara

బాలయ్య కొత్త సినిమా డైలాగ్​ లీక్ చేసిన డైరెక్టర్ - balayya raviteja episode

Balayya new movie: బాలయ్య సినిమా అంటే అదిరిపోయే డైలాగ్​లు. ఆయన సినిమాలో ఫైట్లు, డైలాగ్స్​ కోసమే థియేటర్​కు వెళ్లేవాళ్లు చాలామంది. అలాంటి బాలకృష్ణ కొత్త సినిమాలోని ఓ డైలాగ్ ముందే లీకైతే.. ఫ్యాన్స్​ పండగే కదా! ఇంకెందుకు ఆలస్యం ఈ స్టోరీ చదివేసి ఆ డైలాగ్ ఏంటో తెలుసుకోండి.

balakrishna
బాలయ్య
author img

By

Published : Jan 1, 2022, 10:57 AM IST

Balakrishna movies: 2021 చివర్లో 'అఖండ' అంటూ థియేటర్లలోకి వచ్చిన బాలయ్య.. తెగ సందడి చేశారు. అఘోరా గెటప్​లో కనిపించి, మెస్మరైజ్ చేశారు. దానికితోడు తమన్ అందించిన బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ అయితే అభిమానుల చేత కేకలు పెట్టించింది. బోయపాటి దర్శకత్వం, ఈ సినిమాలోని అద్భుతమైన డైలాగ్​లో సినిమా బ్లాక్​బస్టర్​ హిట్​గా నిలిపాయి. దీంతో బాలయ్య ఫ్యాన్స్ తెగ పండగ చేసుకున్నారు.

balayya akhanda movie
అఖండ సినిమాలో బాలయ్య

ప్రస్తుతం బాలకృష్ణ కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. 'క్రాక్' సినిమా సాలిడ్​ హిట్​ కొట్టిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాలోని ఓ డైలాగ్​ను స్వయంగా డైరెక్టర్ గోపీచంద్ రివీల్ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా అభిమానులకు మర్చిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు.

'ఆహా' ఓటీటీలో బాలయ్య హోస్ట్​గా వ్యవహరిస్తున్న 'అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే' టాక్​షోకు హీరో రవితేజ గెస్ట్​గా వచ్చిన ఎపిసోడ్.. డిసెంబరు 31న విడుదలైంది. అదే ఎపిసోడ్​లో రవితేజతో మూడు సినిమాలు తీసి హిట్​లు కొట్టిన గోపీచంద్ మలనేని కూడా తళుక్కున మెరిశారు. ఈ క్రమంలోనే మాటలమధ్యలో తనతో చేయబోయే సినిమాలోని ఏదైనా ఓ డైలాగ్​ను చెప్పమన్నారు.

unstoppable with nbk raviteja episode
బాలయ్య-రవితేజ 'అన్​స్టాపబుల్' ఎపిసోడ్

"రేయ్ రోడ్డు మీదకి జింక లేదా గొర్రె వచ్చిందనుకో ఎవడైనా హారన్ కొడతాడు. అదే సింహం వచ్చిందంటే హారన్ కాదు కదా ఇంజిన్ కూడా ఆపేసి సైలెంట్​గా కూర్చుంటాడు. అక్కడున్నది సింహం రారేయ్" అంటూ సినిమాలోని బాలయ్య క్యారక్టరైజేషన్​కు సంబంధించిన ఓ డైలాగ్​ను రివీల్ చేశారు.

నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కబోయే ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్​గా చేస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతినాయకురాలిగా నటించనుంది! మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. త్వరలో షూటింగ్ మొదలు కానుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.