ETV Bharat / sitara

వ్యూస్​ కోసం డబ్బులిచ్చాడు.. దొరికిపోయాడు!

నకిలీ ఫాలోవర్ల స్కామ్​లో తాను భాగమైనట్లు చెప్పేశాడు ర్యాపర్​ బాద్​షా. తన ఆల్బమ్​ పాటకు వ్యూస్​ పెంచేందుకు భారీగా డబ్బులు చెల్లించినట్లు పోలీసు విచారణలో వెల్లడించాడు.

author img

By

Published : Aug 9, 2020, 2:17 PM IST

వ్యూస్​ కోసం డబ్బులిచ్చాడు.. దొరికిపోయాడు!
ర్యాపర్ బాద్​షా

బాలీవుడ్​ ర్యాపర్​ బాద్​షా.. ముంబయి పోలీసుల విచారణలో తప్పు ఒప్పేసుకున్నాడు. తన ఆల్బమ్ సాంగ్ వ్యూస్​ పెంచేందుకు డబ్బులు చెల్లించిన మాట వాస్తవమేనని అతడు చెప్పినట్లు డిప్యూటీ కమీషనర్ నందకుమార్ ఠాకుర్ వెల్లడించారు. నకిలీ ఫాలోవర్స్ స్కామ్​లో భాగంగా 7.2 కోట్ల వీక్షణల కోసం బాద్​షా రూ.72 లక్షలు చెల్లించాడని చెప్పారు.

అసలేం జరిగింది?

బాద్​షా రూపొందించిన ఆల్బమ్ గీతం 'పాగల్'.. విడుదలైన 24 గంటల్లో 75 మిలియన్ల వ్యూస్​ సాధించింది. ఈ క్రమంలోనే టేలర్ స్విఫ్ట్, కొరియన్ బ్యాండ్ బీటీఎస్ రికార్డులను అధిగమించింది. అయితే గూగుల్ ఈ వాదనను తిరస్కరించింది. దీంతో నకిలీ ఫాలోవర్ల అంశం తెరపైకి వచ్చింది. ఈ స్కామ్​తో సంబంధముందనే అనుమానంతో పోలీసులు బాద్​షాను విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ కేసులో భాగంగా ఇప్పటికే 20 మంది సెలబ్రిటీలను పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

అంతకు ముందు మాట్లాడిన బాద్​షా.. తనకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పాడు. ఆరోపణల్లో నిజం లేదని, అలాంటి ప్రచారం చేస్తున్న వారిని క్షమించనని తెలిపాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.