Arjun kapoor Malaika arora releationship: 'వయసును చూసి ప్రేమించాలని అనేది నా దృష్టిలో వెర్రితనం.. నచ్చినవాళ్లతో కలిసి జీవించాలనుకోవడంలో తప్పులేదు' అని అన్నారు బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్. తనపై ట్రోల్స్ చేసేవారే తనతో సెల్ఫీ దిగేందుకు ముందుకు వస్తుంటారని చెప్పారు.
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తనకన్నా వయసులో పెద్దదైన ఫిట్నెస్ బ్యూటీ మలైకా అరోరాతో చాలా కాలం నుంచి రిలేషన్షిప్లో ఉంటున్నారు. తమకు సంబంధించిన ఫొటోలను సోషల్మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్ వీరి జంటపై ఓ కామెంట్ చేశాడు. 'ఆంటీతో డేటింగ్ చేస్తున్నావు' అని అన్నాడు. దీంతో అతడికి గట్టి సమాధానమిచ్చారు అర్జున్. ప్రేమకు వయసుతో సంబంధం లేదని అన్నారు.
"కామెంట్స్ చేసేవారిలో సగం మంది ఫేక్. వాటి గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు. నా గురించి మాట్లాడేవాళ్లే నాతో సెల్ఫీలు దిగుతారు. నా వ్యక్తిగత జీవితంలో ఏదైనా చేస్తాను. అది నా హక్కు. నా పనికి గుర్తింపు లభిస్తే చాలు. ఇక వయసును చూసి ప్రేమించాలి అనేది నా దృష్టిలో వెర్రితనం.. నచ్చినవాళ్లతో కలిసి జీవించాలనుకోవడంలో తప్పు లేదు" అని గట్టిగా బదులిచ్చారు. ప్రస్తుతం అర్జున్.. 'ఏక్విలన్ రిటర్న్స్'లో నటిస్తున్నారు.
ఇదీ చూడండి: మలైకా అంటే అందుకే ఇష్టం: అర్జున్