ETV Bharat / sitara

అమితాబ్​ ఇంట్లో కరోనా.. సింగర్ సోనూ నిగమ్ ఫ్యామిలీకి పాజిటివ్ - కరోనా బాలీవుడ్

Corona bollywood: కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు వైరస్​ బారిన పడుతున్నారు. స్టార్ సింగర్ సోనూ నిగమ్ ఫ్యామిలీకి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

Amitabh Bachchan
అమితాబ్ బచ్చన్
author img

By

Published : Jan 5, 2022, 12:24 PM IST

Amitabh bachchan corona: బిగ్​బీ అమితాబ్ బచ్చన్.. ప్రతిరోజూ తన బ్లాగ్ ద్వారా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. కానీ బుధవారం మాత్రం 'డొమస్టిక్ కొవిడ్ సిట్యూయేషన్'(ఇంట్లోనే కరోనా పరిస్థితులు) వల్ల అప్డేట్స్​ ఇవ్వలేకపోతున్నానని అన్నారు.

అయితే అమితాబ్ రెండు బంగ్లాలో వైద్యపరీక్షలు చేయగా, సిబ్బందిలో ఒకరికి పాజిటివ్​గా తేలింది. దీంతో అతడిని క్వారంటైన్​లో పెట్టినట్లు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్​ అధికారి ఒకరు వెల్లడించారు.

2020లో అమితాబ్ బచ్చన్​తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్, మనవరాలు ఆరాధ్య.. కరోనా బారిన పడ్డారు. గతేడాది మే నెలకల్లా అమితాబ్ రెండు వ్యాక్సిన్ వేసుకున్నారు.

Sonu nigam covid: బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ కుటుంబం కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం దుబాయ్​లో హోమ్ క్వారంటైన్​లో ఉన్నామని చెప్పిన సోనూ.. ఇన్​స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.

ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ లెక్కల ప్రకారం ముంబయిలో మంగళవారం 10,860 కేసులు నమోదయ్యాయి. గతేడాది ఏప్రిల్ 7 తర్వాత ఓ రోజులో ఇన్ని కేసులు రావడం ఇదే తొలిసారి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.