ఎప్పుడూ షూటింగ్లో బిజీగా గడిపే స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్.. ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. తన తనయుడు అయాన్ పుట్టినరోజు వేడుకల కోసం ఫ్యామిలీతో కలిసి ఆయన ఇటీవల మాల్దీవులకు వెళ్లారు. దీనిలో భాగంగా కుటుంబంతో కలిసి సాగరతీరాన సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. అలాగే, శనివారం అయాన్ బర్త్‌డేని ఘనంగా నిర్వహించారు. మరోవైపు బన్నీ సతీమణి స్నేహారెడ్డి కూడా సాగర అందాలను, ప్రకృతి రమణీయతను పూర్తిగా ఆనందిస్తున్నారు. స్టైలిష్ దుస్తులు ధరించి తన లేడీ గ్యాంగ్‌తో కలిసి దిగిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. 'సిస్టర్స్ స్క్వాడ్' అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. స్నేహ స్టైల్ బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప'లో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకుడు. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'పుష్ప' అనంతరం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇది మాత్రమే కాకుండా బన్నీ.. వేణు శ్రీరామ్ కాంబోలో 'ఐకాన్' సినిమాను ఇప్పటికే ప్రకటించారు.
ఇదీ చూడండి: 'వీడు హీరోనా అని నవ్వారు'