ETV Bharat / sitara

బన్నీ లైనప్ మామూలుగా లేదుగా! - అల్లు అర్జున్ మురుగదాస్

'పుష్ప'తో పాన్ ఇండియా స్టార్​గా మారబోతున్న అల్లు అర్జున్.. సినిమాల ఎంపిక విషయంలో జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం బన్నీ లైనప్​లో ఆరు చిత్రాలు ఉన్నాయి. ఇందులో మూడు కన్ఫర్మ్ కాగా, మరో మూడు ఎప్పుడు చేస్తారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

Allu Arjun
అల్లు అర్జున్
author img

By

Published : Jun 11, 2021, 4:11 PM IST

భారీ ప్రాజెక్ట్‌లతో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసేందుకు ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ రంగం సిద్ధం చేసుకున్నారు. ఒక్కటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఆరు క్రేజీ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో ఒకటి అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'పుష్ప'. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న బన్నీ.. రీలోడ్‌ చేసిన గన్‌లా సెట్‌లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. శరవేగంగా 'పుష్ప'ని పూర్తి చేసి తన తదుపరి సినిమాలను ఒక్కొక్కటిగా పట్టాలెక్కించనున్నారు. ఇంతకీ బన్నీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లు ఏమిటంటే..

  • అల్లు అర్జున్‌ నుంచి రానున్న మొదటి మూడు సినిమాల్లో.. మొదటిది 'పుష్ప'. బన్నీ-సుకుమార్‌ కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. చిత్రీకరణ చాలావరకూ పూర్తయ్యింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ఊరమాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. రష్మిక కథానాయిక. ఇటీవల విడుదలైన 'పుష్ప' స్పెషల్‌ వీడియో అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • ఈ సినిమా పూర్తైన వెంటనే వేణు శ్రీరామ్‌ డైరెక్షన్‌లో 'ఐకాన్‌' చేయనున్నారు బన్నీ. ఇందులో మన హీరో.. ఫుల్‌ యంగ్‌ లుక్‌లో కనిపించనున్నారు. వేణు శ్రీరామ్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా చెప్పుకొనే 'ఐకాన్‌'ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు.
  • ఇక ముచ్చటగా మూడో సినిమా.. 'పుష్ప-2'. భారీ కథతో తెరకెక్కుతోన్న 'పుష్ప'ను కేవలం రెండున్నర గంటల నిడివిలో చూపించడం కష్టమవుతుందని భావించిన సుకుమార్‌.. దానిని రెండు భాగాల్లో సిద్ధం చేస్తున్నారు. అలా, 'ఐకాన్‌' పూర్తవగానే బన్నీ మరలా ఊరమాస్‌ లుక్‌లోకి మారిపోతారు.

మరో మూడు లైన్​లో!

'పుష్ప', 'ఐకాన్‌', 'పుష్ప-2'.. ఆ తర్వాత వెంటనే బన్నీ మరో మూడు సినిమాలు చేయనున్నారు. అందులో ఒకటి మురుగదాస్‌, మరొకటి బోయపాటి శ్రీను, ఇంకొకటి కొరటాల శివతో. అయితే, ఈ మూడు ప్రాజెక్ట్‌లు ఓకే అయినప్పటికీ ఏది ముందు ప్రారంభమవుతుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా, బన్నీ - ప్రశాంత్‌నీల్‌ కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్‌కు సన్నాహాలు జరుగుతున్నట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. అలాగే విక్రమ్‌ కుమార్‌ కూడా బన్నీ కోసం ఓ స్క్రిప్ట్‌ సిద్ధం చేస్తున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇవీ చూడండి: అదే గొప్ప అవార్డు.. పద్మ పురస్కారంపై సోనూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.