ETV Bharat / sitara

'పుష్ప' కాదు మన సినిమా గెలవాలి: అల్లు అర్జున్ - స్పైడర్​మ్యాన్ రివ్యూ

Pushpa Press meet: ప్రేక్షకులు మళ్లీ ఎక్కువ సంఖ్యలో థియేటర్లకు రావాలని, అలానే సినిమా గెలవాలని ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్ అన్నారు. ముంబయిలో ప్రెస్​మీట్​లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

allu arjun pushpa movie
అల్లు అర్జున్ పుష్ప మూవీ
author img

By

Published : Dec 16, 2021, 4:33 PM IST

Allu arju Pushpa movie: 'సినిమా గెలవాలి.. ప్రపంచ సినిమా గెలవాలి' అని ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ అన్నారు. 'పుష్ప' ప్రచారంలో గురువారం ముంబయిలోని ప్రెస్​మీట్​లో పాల్గొన్న బన్నీ.. 'స్పైడర్​మ్యాన్' సినిమాతో పోటీ గురించి కూడా మాట్లాడారు. అయితే థియేటర్లకు జనాలు మళ్లీ ఎక్కువగా రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

allu arjun rashmika
అల్లు అర్జున్ రష్మిక

"గత కొన్నాళ్ల నుంచి థియేటర్లకు జనాలు రావడం తగ్గిపోయింది. ఈ సందర్భంగా నేను 'పుష్ప' గురించో మరో సినిమా గురించి ఆలోచించడం లేదు. భారతీయ సినిమా గురించి ఆలోచిస్తున్నాను. మన సినిమానే కాకుండా ప్రపంచ సినిమా గెలవాలి. జనాలు మళ్లీ అధిక సంఖ్యలో థియేటర్లకు రావాలి" అని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ అల్లు అర్జున్ సమాధానమిచ్చారు.

Pushpa vs Spider man: తాను హీరోగా నటించిన 'పుష్ప'తో పాటు 'స్పైడర్​మ్యాన్', తర్వాతి వారం రాబోయే '83' సినిమా కూడా బాక్సాఫీసు దగ్గర ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తీసిన 'పుష్ప' సినిమా.. డిసెంబరు 17న ఐదు భాషల్లో రిలీజ్ కానుంది. గతంలో బన్నీతో 'ఆర్య', 'ఆర్య2' చిత్రాలు తీసిన సుకుమార్.. 'పుష్ప'కు దర్శకత్వం వహించారు. రష్మిక హీరోయిన్​గా నటించింది.

allu arjun pushpa movie
పుష్ప సినిమాలో అల్లు అర్జున్

ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ కీలకపాత్ర పోషించారు. అన్ని భాషల్లోనూ ఈయనే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. సునీల్, అనసూయ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియాతో కలిసి సంయుక్తంగా నిర్మించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.