ETV Bharat / sitara

అల్లు అర్హ ఎంట్రీ ఫిక్స్.. 'శాకుంతలం' చిత్రంతో తెరపైకి - శాకుంతంలో అల్లు అర్హ

అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ వెండితెరపై మెరిసేందుకు రంగం సిద్ధమైంది. సమంత హీరోయిన్​గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'శాకుంతలం' సినిమాలో ప్రిన్స్ భరతగా కనిపించనుందీ చిన్నారి.

arha
అర్హ
author img

By

Published : Jul 15, 2021, 1:48 PM IST

అల్లు కుటుంబంలో నాలుగో తరం వెండితెరపై కనిపించేందుకు రంగం సిద్ధమైంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ బిగ్ స్క్రీన్​పై అలరించనుంది. గుణశేఖర్​ స్వీయ నిర్మాణదర్శకత్వంలో రూపొందుతోన్న భారీ ప్రాజెక్ట్ 'శాకుంతలం'లో ఈ చిన్నారి నటించనుంది. దీనిపై అధికారిక ప్రకటన చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో ప్రిన్స్ భరతగా అర్హ కనిపించనుంది.

Shaakuntalam
శాకుంతలం ప్రకటన

మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో సమంత ప్రధానపాత్ర పోషిస్తుంది. దుష్యంతుడి పాత్రను మలయాళ నటుడు దేవ్​ మోహన్​ కనిపించనున్నారు. వీరిద్దరికీ జన్మించిన బాలుడు భరతుడి పాత్రలో అర్హ మెరవనుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే భారీ సెట్స్ రూపొందించారు. కరోనా కారణంగా వాయిదాపడిన ఈ మూవీ చిత్రీకరణ తాజాగా తిరిగి ప్రారంభమైంది.

ఇవీ చూడండి

అల్లు అర్హ.. హీరోయిన్​కు ఏమాత్రం తీసిపోదు!

ఏక్​ బార్​ ఏక్​ బార్​.. ఈ బార్బీబొమ్మకి సీటీమార్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.