ETV Bharat / sitara

Singer Mano: 'రజనీకాంత్ ఫోన్ చేస్తే.. ఎవరు అని అన్నా'

author img

By

Published : Sep 15, 2021, 3:30 PM IST

సింగర్​, నటుడు, జబర్దస్త్ జడ్జిగా.. ఇలా పలు పాత్రల్లో తనదైన శైలిలో అలరిస్తున్న మనో.. ఆసక్తికర విషయాల్ని చెప్పారు. ఎస్పీ బాలుతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

alitho saradaga mano interview
మనో రజనీకాంత్

పాటతో అయినా, మాటతో అయినా ప్రేక్షకులను అలరించడంలో ఆయన రూటే సపరేటు. నాలుగు దశాబ్దాలుగా గాయకుడిగా సంగీతాభిమానుల మనసులు గెలుస్తూనే.. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, నటుడిగా తనలోని విభిన్న పార్శ్వాలను ఆవిష్కరిస్తూ వెళుతున్నారు మనో. సతీసమేతంగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనో, ఆయన సతీమణి జమీల పంచుకున్న విశేషాలు మీకోసం.

హీరోయిన్‌లాంటి అమ్మాయిని కావాలని అడిగారట?

మనో: అవును. మా అమ్మ తనను చూడగానే హీరోయిన్‌ గీతలా ఉందని చెప్పారు. గీత కూడా యూఎస్‌లో కనిపించినప్పుడు 'మనమిద్దరం అక్కాచెల్లెల్లా ఉన్నాం' అని మా ఆవిడతో అన్నారు.

ఈ బుల్లిబాబు ఎలా దొరికాడు?

జమీల: వారే తెనాలికి వచ్చారు. నన్ను చూడటంతోనే 'మీకు నచ్చానా' అన్నారు. 'నచ్చానో లేదో చెబితే, ఆ తర్వాత నేను సమాధానం చెబుతా'నన్నారు. అది వినగానే ఈయనే నాకు కరెక్ట్ అనిపించింది.

.
.

పెళ్లై ఎన్నాళ్లైయింది?

మనో: నాకు 19, ఆమెకు 15 ఏళ్లున్నప్పుడు పెళ్లైంది. 36 ఏళ్ల అనుబంధం మాది. తొందరగా పెళ్లవడం వల్ల ఒక ప్రయోజనముంది. మా పెద్దాడికి 35, మా చిన్నోడికి 33. నాకు తమ్ముళ్లలాగా ఉంటారు. అమ్మాయి వయసు 27 ఏళ్లు. అమెరికాలో స్థిరపడింది.

రాత్రి రెండు, మూడు గంటలకు కూడా ఇంకా బిర్యానీ వండుతున్నావా అమ్మా..?

జమీల: ఇప్పటికీ చేస్తున్నాం అన్న. నాకు వండిపెట్టడం ఇష్టం. ఆయనకు చేయించడం ఇష్టం.

మనో: నాకు స్నేహితులెక్కువ కదా! యూఎస్‌, యూరప్‌ నుంచి వచ్చేటప్పుడు ఫోన్‌ చేస్తారు. అక్కడ సాయంత్రం బయలుదేరి అర్ధరాత్రి 12 కల్లా ఇక్కడికొస్తారు. వాళ్లకది డిన్నర్‌ టైం. విమానాశ్రయం నుంచి నేరుగా ఇంటికొచ్చి మాట్లాడి, డిన్నర్‌ చేసి అక్కడి నుంచి ఏదైనా హోటల్‌కు వెళ్తారు. ప్రపంచంలో స్నేహితులను మించిన విషయం నాకు మరొకటి కనిపించలేదు. నా జీవితంలో నేను సంపాదించిన ఆస్తి స్నేహితులే. మనదేశం, విదేశాల్లో కలిపి దాదాపు 4వేల మంది స్నేహితులున్నారు.

మనోను మొదటిసారి చూడగానే ఏమనిపించింది?

జమీల: మొదట ఆయన్ను సినిమాల్లో చూశా. 'రంగూన్‌ రౌడీ', 'కేటుగాడు' చిత్రాల్లో బాలనటుడిగా చేశారాయన. అబ్బాయి బాగుంటాడని ఇంట్లో వాళ్లు చెప్పారు. పదిహేనేళ్ల వయసులో ఏం తెలుస్తుంది. చూడగానే నచ్చాడంతే!

మనో పాడిన పాటల్లో మీకు బాగా నచ్చింది?

జమీల: 'కిల్లర్‌' సినిమాలోని 'ప్రియా ప్రియతమా..రాగాలు' పాట అంటే ఇష్టం.

ఎవరికోసం ఈ పాట పాడారు?

మనో: ఇళయరాజా దగ్గర ఎవరినీ ఊహించుకోవడం ఉండదు. పాట జాగ్రత్త పాడాలి అనే ధ్యాసే ఉంటుంది. పాట బాగా రావాలనే దానిమీదే ఏకాగ్రత ఉంటుంది. ఆయన మార్పులు చెబుతారు. ఆయన ఓకే అన్నారంటే పాట బాగుందని అర్థం. అప్పటిదాకా పాడాల్సిందే.

.
.

చిత్ర పరిశ్రమలోకి ఎలా అడుగుపెట్టారు?

మనో: 14 ఏళ్ల వయసులో ఎమ్‌ఎస్‌ విశ్వనాథన్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. నాకు స్వరం రాసే అలవాటుంది. ఆయనొకసారి ఏదో పాట పడుతుంటే, నేను వెంటనే స్వరం రాసేశాను. ఆయన విని 'అబ్బాయి బాగా రాస్తున్నాడే' అని మెచ్చుకున్నారు. అది విని మిగతా సీనియర్లు 'ఇంకొకసారి స్వరం రాస్తే మద్రాస్‌లో ఉండవు' అని బెదిరించారు. రెండోసారి స్వరం రాయమని విశ్వనాథన్‌ గారు అడిగితే నేను రాయలేదు. ఆయన వెంటనే విషయం గ్రహించారు. నేర్చుకోవడానికి నాకు ఎక్కడ అడ్డు పడతారోనని ఆయనా మౌనంగా ఉన్నారు. అక్కడ రోజూ నా సంతకం తీసుకునేవారు. హాజరు కోసం తీసుకుంటున్నారామో అనుకున్నాను. సంతకం నా దగ్గర తీసుకొని డబ్బులు వాళ్లు తీసుకుంటున్నారని ఏడాది తర్వాత తెలిసింది.

చక్రవర్తి దగ్గర ఎలా చేరారు?

మనో: మా అన్నయ్య తబలా వాయించేవారు. ఒకసారి చక్రవర్తిగారి దగ్గరకి వెళ్లాం. అక్కడ హార్మోనియం వాయిస్తూ 'పది మందిలో పాడినా' అనే పాటందుకున్నాను. చక్రవర్తి తబలా పని పక్కన పెట్టి నా వివరాలు కనుక్కొన్నారు. 'నువ్వు నా దగ్గర పనిచేయాల'న్నారు. వెంటనే విశ్వనాథన్‌ గారికి ఫోన్‌ చేసి చెప్పారు. ఆయన నా పనితనం, మంచితనం గురించి చక్రవర్తి గారికి చెప్పి, 'మీ దగ్గరైతే బాగా ఉపయోగపడతాడు.. పైకొస్తాడు' అని చెప్పారు. మరుసటి రోజే ఆయన దగ్గర చేరాను. సంవత్సరంలో 80కి పైగా సినిమాలకు సంగీతం అందించేవారాయన. నేను స్వరం రాస్తాను, హార్మోనియం వాయిస్తాను, పాట పాడతాను. గాయకులకు పాటలు నేర్పించడం, కంపోజింగ్‌ అసిస్టెంట్ ఇలా అన్నిరకాల పనులూ చేశా. చిన్నతనంలో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టడం నా అదృష్టం. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా.

.
.

అమ్మానాన్న కాకుండా మీ లైఫ్‌లో ముఖ్యమైందెవరు?

మనో: మా సోదరి మహిజ. చాలా కష్టపడింది. నేను స్థిరపడటానికి ఆమే కారణం. ఇల్లు, స్థలం కొనడం ప్లానింగ్‌ అంత ఆవిడదే. ఆమె తరువాత నా సామ్రాజ్యాన్ని నడిపిస్తుంది జమీలే. ఈమె నా భార్యగా దొరకడం అదృష్టం. పనివెతుక్కోవడం, డబ్బులు సంపాదించడం మన పని. ఇంటిని, పిల్లల బాధ్యతను మోయడం సాధారణ విషయం కాదు.

నాగూర్‌ బాబు అనే వ్యక్తి గాయకుడిగా ఎలా మారాడు?

మనో: నేను చక్రవర్తిగారి దగ్గర పైలెట్‌ సింగర్‌గా పాడటం, గాయకులకు పాటలు నేర్పించడటం చేస్తుండేవాడిని. అప్పుడు బి.గోపాల్‌, కోదండరామిరెడ్డి లాంటి దర్శకులు నా గొంతు బాగుందనేవారు. ఒకరోజు ఇళయరాజా కొత్తగాయకుల కోసం వెతుకుతున్నారని తెలిసింది. ఇళయరాజా తమ్ముడు నన్ను ఆయన దగ్గరకు తీసుకెళ్లారు. అలా 1985లో ఇళయరాజా నన్ను కోలీవుడ్‌కు పరిచయం చేశారు. ఆ తర్వాత కూడా అవకాశాలిచ్చారు. కొన్నాళ్ల తర్వాత చక్రవర్తి గారు 'నిన్ను వదిలేసుకోవడం ఇష్టం లేకనే గాయకుడిగా అవకాశలివ్వలేదు రా, నన్ను క్షమించు' అన్నారు. కానీ 'ఇక్కడ నేర్చుకున్న పనివల్లే నాకు అవకాశాలు వచ్చాయి కదా సార్‌' అని బదులిచ్చాను.

మద్రాస్‌ అనుభవాలు?

మనో: జీ ఆనంద్‌గారు మా అమ్మానాన్నలతో పనిచేసేవారట. నేను విశ్వనాథ్‌గారి దగ్గర పనిచేస్తున్నానని తెలిసి ఆయనకు దగ్గరలోనే రూ.35కు అద్దె గది చూపించారు. ప్రతినెలా రూ.150 పంపించేవాడిని. మిగిలిన డబ్బులతోనే నెలంతా గడిపేవాడిని. మంచి భోజనం చేయాలంటే అప్పుడు పాండిబజార్లోని కళ్యాణమండపాలకు వెళ్లేవాడిని. ఒకసారి వెళ్తే మళ్లీ 15 రోజుల వరకూ అటు దిక్కు వెళ్లేవాడిని కాదు. వాచ్‌మెన్‌ గుర్తుపడతాడేమోనని భయం.

మనో మీద మీకున్న ఫిర్యాదేంటి?

జమీల: అలాంటిదేమీ లేదన్నా. 36 ఏళ్లలో ఎలాంటి ఇబ్బంది రాలేదు. నా మూడో బిడ్డ చనిపోయినప్పుడు మాత్రం దిగులు పడ్డాను. అప్పుడు ఆయనే అండగా నిలబడ్డారు. ఆ సమయంలోనే థైరాయిడ్‌ కారణంగా ఆరోగ్య సమస్యలొచ్చాయి. దాని కారణంగానే నా గొంతులో కూడా తేడా వచ్చింది.

.
.

బాబు ఎలా చనిపోయారు?

మనో: నాలుగేళ్ల ఏళ్ల వయసులో మా మూడో బాబు దూరమయ్యాడు. ఏమనుకుని పెట్టానో కానీ షాహెద్‌ అని పేరు పెట్టాను. షాహెద్‌ అంటే త్యాగమని ఆ పేరుపెట్టినప్పుడు తెలియదు. మా కంపౌండ్‌కు పక్కనే కొత్త ఇంటి కోసం ఒకాయన సంపు కట్టాడు. వర్షం నీళ్లు చేరి అందులో చిన్న చిన్న చేపలు కనిపించేవి. వాటిని చూసేందుకు వెళ్లి అందులో పడిపోయాడు. సమయానికి మా ఆయా వాడితో లేదు. 15 నిమిషాల్లో అంతా అయిపోయింది. వాడు చనిపోయి మిమ్మల్ని బతికించాడని ఓ సిద్ధాంతి చెప్పారు. అలా వాడు మా కుటుంబానికి త్యాగమూర్తి అయ్యాడు.

మనో ఇంట్లో సాయం చేస్తారా?

జమీల: చూస్తారాన్న.. ఎలా చేస్తున్నానో చూస్తారు. ఆయన కాస్ట్యూమ్స్‌ నుంచి మేకప్‌ వరకూ అన్నీ నేనే చూసుకుంటాను. ఒక్కోసారి ఏ కలర్‌ డ్రెస్‌ వేసుకున్నారనేది మార్క్‌ చేసుకొని రిపీట్‌ అవ్వకుండా చూసుకుంటాను. భర్తను చూసుకోవడాన్ని గర్వంగా ఫీలవుతాను.

ఎన్ని పాటలు పాడారు?

మనో: 11 భాషల్లో పాటలు పాడాను. దాదాపు 25,143 సినిమా గీతాలు పాడాను. ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ పాతిక వేలు, భక్తి పాటలు మరో పాతిక వేలు పాడుంటాను.

బాలుతో అనుబంధం?

మనో: బాలు నాకు సొంత అన్నయ్య కన్నా ఎక్కువ. మా పెళ్లికి సాక్షి సంతకం చేసింది కూడా బాలుగారే. చక్రవర్తిగారి దగ్గర పనిచేస్తున్నప్పుడే పరిచయం. ఆయన కన్నా బాలుతో ఎక్కువ అనుబంధం ఉండేది. ఎన్నో మరపురాని అనుభూతులున్నాయి. 40 ఏళ్ల అనుబంధముంది. ఇప్పటికీ ఆయన ఉన్నారనే భావిస్తాం. బాలుతో అతిదగ్గరగా ఉన్నవాళ్లకు ఆయన లేని లోటు పూడ్చలేనిది. మేమిద్దరం కలిసి వంద పాటల దాకా పాడాం. 'దోస్తు మేరా దోస్త్‌' గీతం మేమిద్దరం పాడిందే.

sp balu singer mano
బాలుతో మనో

చిన్ననాటి స్నేహితులు ఇప్పటికీ ఉన్నారా?

మనో: మోహన్‌, సాదిక్‌ ఇలా విజయవాడలో చాలా మందే ఉంటారు. ఆరో తరగతి చదువుకుంటున్నప్పటి నుంచి స్నేహితులు. వయసు పెరిగేకొద్దీ మా అనుబంధం పెరుగుతూ వస్తోంది. నా ఫ్రెండ్‌తో కలిసి సింగపూర్‌ వెళితే, అక్కడ వాడి పాస్‌పోర్ట్‌ తడిసి మొత్తం పాడైపోయింది. ఆ సమయంలో ఇండియన్‌ హై కమిషన్‌లో ఒక ఫ్రెండ్‌ ఉంటే ఆయన సాయం చేశారు. ఫోన్‌ చేసి ఇలా జరిగిందని చెబితే 12 గంటల్లోపు కొత్త పాస్‌పోర్ట్‌ వచ్చేసింది. స్నేహం వల్లే సులభమైంది.

పిల్లలు ఏం చేస్తున్నారు?

మనో: పెద్దోడు ఒక సినిమా చేశాడు. కరోనాకు ముందు విడుదలవ్వాల్సింది ఆగిపోయింది. దీంతోపాటే ఒక చిన్నబిజినెస్‌ ఆరంభించాడు. చిన్నోడికి వంటలు చేయడం బాగా ఇష్టం. ఒక ఐటీ సెంటర్‌లో రెస్టారెంట్ ఓపెన్‌ చేశాడు. కానీ కరోనాతో ఇద్దరి వ్యాపారాలు దెబ్బతిన్నాయి.

మీ ఇంట్లో ఎంతమంది?

మనో: ముగ్గురు అన్నదమ్ములం. ఒక సోదరి. అందులో ఇద్దరు చనిపోయారు. మా అన్నయ్య కూడా తబలా వాయిద్యకారుడు.

స్నేహితులు బయటెక్కువున్నారా? పరిశ్రమలో ఎక్కువగా ఉన్నారా?

మనో: బయటే ఎక్కువ. బాలు గారు ఇంతమంది స్నేహితులేంట్రా అనేవారు. అమెరికా వెళ్లినా, అమలాపురం వెళ్లినా ఎక్కడ చూసిన నీ ఫ్రెండ్సే అని సరదాగా అనేవారు.

మీరు సంగీతమందించిన తొలి సినిమా?

మనో: 'సోంబేరి' సినిమాకు పనిచేశాను. నాకు ఇష్టమైన నటుడు ఆలీ అందులో హీరో(నవ్వులు). ఆ సినిమా ఆడియో వేడుకకు ఏఆర్‌ రెహమాన్‌ అతిథిగా వచ్చారు.

రజనీకాంత్‌ సినిమాలకు డబ్బింగ్‌ చెప్పే అవకాశం ఎలా వచ్చింది?

మనో: 'ముత్తు' సినిమా నిర్మాతలతో పాటు, రచయిత శ్రీరామకృష్ణలు నాకా అవకాశమిచ్చారు. సాయికుమార్‌ అప్పటికి కన్నడ హీరోగా చాలా బిజీగా ఉన్నారు. 'బాషా' సినిమా వరకూ ఆయనే చెప్పారు. 'ముత్తు' సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించారు. ఆయనకోసం చాలా ప్రయత్నించారు. కానీ వీలుపడలేదు. వేరే డబ్బింగ్‌ ఆర్టిస్టులను సంప్రదించారు. చివరకు రచయిత శ్రీరామకృష్ణ ఫోన్‌ చేసి క్లైమాక్స్‌ డబ్బింగ్‌ చెప్పండి. రజనీసార్‌కు నచ్చితే ఓకే చేస్తారని చెప్పారు. సూపర్‌స్టార్‌కు ఒక్కసారి చెప్పినా చాలు, ఆ తర్వాత నా వాయిస్‌ వాడకున్నా పర్లేదు అనుకుని వెళ్లి చెప్పాను. రెండు రోజులకు వాళ్లే ఫోన్‌చేసి 'రజనీ సర్‌కు మీ వాయిస్‌ బాగుంది, కొనసాగించండి' అని చెప్పారన్నారు. అదో అద్భుతం.

రజనీకాంత్‌ ఫోన్‌ చేస్తే గుర్తుపట్టలేదట!

మనో: నాకు కమెడియన్లతో స్నేహమెక్కువ. ఇక్కడైనా తమిళంలోని వడివేలు, గౌండమణి, వివేక్‌ లాంటి హాస్యనటులు నాతో స్నేహంగా ఉంటారు. అయితే 'చంద్రముఖి' విడుదలయ్యాక రాత్రి పదింటికి ఫోన్‌ చేసి 'నేను రజనీకాంత్‌ను మాట్లాడుతున్నాను' అన్నారు. మా వాళ్లెవరైనా మిమిక్రీ చేస్తూ ఆటపట్టిస్తున్నారేమో అనుకున్నాను. అందుకే ఆయన రజనీని మాట్లాడుతున్నానని చెప్పగానే 'ఏ రజనీకాంత్‌?' అన్నాను. ఆయన తడబడటం చూసి ఫోన్‌ చేసింది రజనీ గారే అని అర్థమయింది. సారీ చెప్పాను. 'చంద్రముఖి తెలుగు వెర్షన్‌ ఇప్పుడే చూశా. డబ్బింగ్‌ అద్భుతంగా చెప్పారు' అని ఆయన స్టైల్‌లో నవ్వుతూ అభినందించారు. ఆ రాత్రంతా ఆనందంలో తేలిపోయాను. ఏం కావాలో కోరుకోమన్నారు. 'బిర్యాని చేయించి పంపిస్తాను తినిపెట్టండి సర్ చాలు' అని చెప్పాను. రజనీ సర్‌ పిల్లలు కూడా ఫోన్‌ చేస్తారు. మా ఆవిడ ఆంధ్రా పచ్చళ్లు పంపిస్తుంది. చిరంజీవి తెనాలి వెళ్తే, మా ఇంటి నుంచే భోజనం వెళ్తుంది. అంతటి మహానుభావులకు భోజనం పెట్టే అదృష్టం దక్కింది.

కమల్‌ హాసన్‌కు కూడా డబ్బింగ్‌ చెప్పారు కదా?

మనో: రెండు సినిమాలకు డబ్బింగ్‌ చెప్పాను. బాలు గారే చెప్పమని సిఫార్సు చేశారు. 'సతీ లీలావతి' సినిమాకు పశ్చిమ గోదావరి ప్రత్యేకమైన యాస ఉంటుంది. దానికి నా వాయిస్‌ అయితే బాగుంటుందని నన్ను చేయమన్నారు. కమల్‌ హాసన్‌, సిమ్రాన్‌ నటించిన ‘బ్రహ్మచారి’ సినిమాకూ డబ్బింగ్‌ చెప్పాను.

మోహన్‌ బాబుతో అనుబంధం ఎలా ఉంటుంది?

మనో: మోహన్‌బాబు ‘కేటుగాడు’ సినిమాలో ఆయన చిన్నప్పటి పాత్రలో బాలనటుడిగా చేశాను. దానికన్నా ముందే దాసరి గారి ఇంట్లో కనిపిస్తూ ఉండేవారు.

రజనీకాంత్ బయట ఎలా ఉంటారు?

మనో: ‘బాబా’ సినిమాకు ఆయనతో కలిసి పనిచేశాను. రెండు సినిమాల డబ్బింగ్‌ ఒకేసారి జరిగింది. బయట ఎలా కనిపిస్తారో, తెరపైనా అలాగే కనిపిస్తారు. అదే వేగం, అదే స్టైల్‌.

భర్తను ఇంకా ఎలాంటి స్థాయిలో చూడాలనుంది?

జమీల: ప్రతి భార్యకు భర్తను గొప్పగా చూడాలని ఉంటుంది. ముందైతే ఆయన్ను ప్రభుత్వం గుర్తించాలి. పద్మశ్రీ తీసుకుంటే చూడాలని ఉంది.

ఎప్పుడైనా జమీలాకు కోపం వస్తే ఏ పాట పాడి శాంతపరుస్తావు?

మనో: మనదేమీ గవర్నమెంట్‌ ఉద్యోగం కాదు కదా! ఒక్కోసారి రాత్రుళ్లు రికార్డింగ్‌లకు వెళ్లాల్సి వచ్చేది. నేనొచ్చే వరకూ తినకుండా వేచి చూస్తుంటుంది. ఎప్పుడైనా ముఖం చూసినప్పుడు తను కోపంగా ఉందని తెలిసిపోతుంది. అప్పుడు పాటలు పాడి శాంతపరిచే ప్రయత్నం చేస్తాను. జేసుదాసు, ఘంటసాల పాటలు అందుకోసం వాడుకుంటాను. 'మనసున మనసై బతుకున బతుకై' అనే పాటందుకుంటాను. వెంటనే చాలు చాలు అంటూ భోజనం పెడుతుంది. ఒక్కోసారి ఆ పాట గుర్తు రాకుంటే 'అపురూపమైనదమ్మ ఆడజన్మ పాటపాడతాను'

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.