Alia Bhatt Rajamouli RRR: దర్శకుడు రాజమౌళిపై బాలీవుడ్ హీరోయిన్ ఆలియాభట్ గుర్రుగా ఉందా? అంటే అవుననే మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. తన సోషల్‌మీడియాలో ఖాతాలో 'ఆర్ఆర్ఆర్'కు సంబంధించిన కొన్ని పోస్ట్‌లను ఆలియా తొలిగించిందని, ఇన్‌స్టాలో జక్నన్నను అన్‌ఫాలో చేసిందని అంటున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. అందుకే 'ఆర్ఆర్ఆర్'లో ఆమె నటించినప్పటికీ.. సినిమా విడుదలయ్యాక స్పందించలేదని పేర్కొంటున్నారు.
ఏమి జరిగిందంటే?... 'ఆర్ఆర్ఆర్' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. ఈ చిత్రంలో హీరో రామ్‌చరణ్‌కు జోడీగా సీత పాత్రలో నటించింది. కనిపించింది కాసేపే అయినా తన నటనతో ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో సమయంలో ఆలియా పాత్ర నిడివి కాసేపే ఉంటుందని కానీ అది కీలకంగా ఉంటుందని చెప్పింది చిత్రబృందం. కానీ సినిమా రిలీజ్ అయ్యాక తారక్, చరణ్ పాత్రలకు వచ్చిన క్రేజ్ ఇంకే పాత్రలకు రాలేదనే చెప్పాలి. ముఖ్యంగా ఆలియా పాత్ర.. మూవీ టీమ్ క్రియేట్ చేసిన హైప్‌కు రీచ్ కాలేకపోయింది. దీంతో తన రోల్‌కు తగినంత ప్రాధాన్యత దక్కక పోవడం వల్ల ఆమె కాస్త అసంతృప్తికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు తన పాత్ర నిడివి విషయంలోనూ ఆమె నిరాశ చెందినట్లు తెలుస్తోంది. ఫైనల్ కట్లో ఆమె పాత్రకు సంబంధించిన చాలా సన్నివేశాలను తొలిగించినట్లు, అందుకే ఆమె అసహనానికి గురైందని అంతా అంటున్నారు. అందుకే ఆమె రాజమౌళిని ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిందనే టాక్ బలంగా వినిపిస్తోంది.
ఆలియా ఇన్‌స్టాలో ఏం చూపిస్తోందంటే... సోషల్‌మీడియాలో నేడు(మంగళవారం) ఉదయం ఆలియా.. రాజమౌళిని అన్‌ఫాలో చేసినట్లు జోరుగా ప్రచారం సాగింది. ఆ సమయంలో ఆలియా ఫాలో అవుతున్న వారి సంఖ్య 472 ఉంది. అందులో రాజమౌళి పేరు కనపడలేదని నెటిజన్లు అన్నారు. కానీ ఈ ప్రచారం జోరుగా సాగిన తర్వాత ఆమె ఫాలో అవుతున్న వారి సంఖ్య 474కు చేరింది. అందులో జక్కన్న పేరు కూడా కనిపించింది. మరి ఆమె అన్‌ఫాలో చేసి ఆ తర్వాత ఫాలో అయిందా లేదా నెటిజన్లు సరిగ్గా చూసుకోకుండా తప్పుడు ప్రచారం చేశారా అనేది స్పష్టత లేదు.
ఇదీ చూడండి: 'ఆర్ఆర్ఆర్'పై తారక్ భావోద్వేగం.. మాటలు రావడం లేదంటూ..