అకాడమీ ఆఫ్ మోషన్ పిక్షర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(ఐఎంపీఏఎస్)లో సభ్యులుగా చేరాలని 819 కళాకారులు, ఎగ్జిక్యూటివ్స్‌కు ఆహ్వానం అందింది. వీరిలో బాలీవుడ్ తారలు ఆలియా భట్, హృతిక్ రోషన్, కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా ఉన్నారు. వీరితో పాటే క్యాస్టింగ్ డైరెక్టర్ నందిని శ్రీకాంత్, డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్స్ నిష్ట జైన్, షర్లీ అబ్రహం, అమిత్ మాధేషియా, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ విశాల్ ఆనంద్, సందీప్ కమల్‌లు ఈ జాబితాలో ఉన్నారు.
ఈ ఆహ్వానాన్ని అంగీకరించిన వారికి, వచ్చే ఏడాది ఏప్రిల్ 25న జరిగే 93వ ఆస్కార్ అవార్డుల విజేతలను ఎంపిక చేసే ప్రక్రియలో ఓటు హక్కు లభిస్తుంది. ఈ ఏడాది ఆహ్వానం అందుకున్న వారిలో 45 శాతం మహిళలు, 68 దేశాలకు చెందిన కళాకారులు ఉన్నట్లు అకాడమీ తెలిపింది.
వివాదాలను అరికట్టేందుకే
ప్రతిభను గుర్తించడంలో విఫలమైందంటూ 2016లో ఆస్కార్ అవార్డులను 'వైట్'గా పిలిచారు. ఈ క్రమంలోనే అటువంటి వివాదాలకు కళ్లెం వేసేందుకు, ఓటింగ్ విషయంలో నాణ్యతగా పాటించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు అకాడమీ అధ్యక్షుడు డేవిడ్ రూబిన్ తెలిపారు. దీనితో పాటే నామినేషన్ల ప్రమాణాలను అమలు చేయడం సహా ఐదేళ్లకు కొత్త ప్రణాళికను ఆకాడమీ ప్రకటించింది.
హాలీవుడ్ ప్రముఖలూ ఆహ్వానం
2019 ఉత్తమ చిత్రంగా నిలవడం సహా అనేక విభాగాల్లో ఆస్కార్ అందుకున్న 'పారాసైట్' బృందం నుంచి కొంతమంది నటీనటులకు అకాడమీ ఆహ్వానం పంపింది. వీరితో పాటే సింథియా ఎరివో, జాన్ డేవిడ్ వాషింగ్టన్ లాంటి హాలీవుడ్ ప్రముఖుల పేర్లూ ఈ జాబితాలో ఉన్నాయి.
గతేడాది 842 మంది సభ్యులను కొత్తగా ఆహ్వానించగా.. వారిలో భారత్ నుంచి జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్, సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్‌లు ఉన్నారు.
నామినేషన్ ఎంపికలో 'గల్లీబాయ్' విఫలం
గతేడాది భారత్ నుంచి ఆస్కార్ రేసులో నిలిచిన 'గల్లీబాయ్'.. అకాడమీ నామినేషన్‌కు ఎంపిక కావడంలో విఫలమైంది. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్, ఆలియా భట్ హీరోహీరోయిన్లు. జోయా అక్తర్ దర్శకత్వం వహించారు.