'మ్యాన్ వర్సెస్ వైల్డ్'... డిస్కవరీ ఛానెల్లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో బేర్ గ్రిల్స్ చేసే సాహసాలు ఎంతో ఆసక్తిగా ఉంటాయి. భారత్ నుంచి ఈ కార్యక్రమానికి గతంలో ప్రధానమంత్రి మోదీ వెళ్లి ఎన్నో సాహసాలు చేశారు. ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో విన్యాసాలు చేయించాడు బేర్ గ్రిల్స్. ఇప్పుడు ఆ జాబితాలోకి హీరో అక్షయ్ కుమార్ చేరాడు. త్వరలో అతడికి సంబంధించిన చిత్రీకరణ జరగనుంది.
అక్షయ్ కోసం బేర్ గ్రిల్స్.. ఇప్పటికే అనువైన స్థలాన్ని వెతికినట్లు తెలుస్తోంది. 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' షోలో పాల్గొనేందుకు ఇప్పటికే మైసూర్ చేరుకున్నాడని సమాచారం. త్వరలో షూటింగ్ ప్రారంభించనున్నారట. అక్షయ్ కుమార్.. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
ఇదీ చదవండి: 'సినీ పరిశ్రమ నుంచి అతడ్ని బహిష్కరించండి'