ETV Bharat / sitara

'అఖండ' మాస్ జాతర.. 'బింబిసార' టీజర్​కు టైమ్​ ఫిక్స్ - naga shourya movies

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. వీటిలో అఖండ, బింబిసార, లక్ష్య, గమనం, లైగర్ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

akhanda - bimbisara movies
అఖండ - బింబిసార మూవీ
author img

By

Published : Nov 28, 2021, 12:24 PM IST

*''అఖండ' మాస్ జాతర' పేరుతో కొత్త ట్రైలర్​ను ప్రేక్షకులకు అందించారు. ఇందులో బాలయ్య మార్క్​ డైలాగ్​లతో పాటు యాక్షన్ సీన్స్​ను కూడా చూపించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సినిమా డిసెంబరు 2న థియేటర్లలోకి రానుంది. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. జగపతిబాబు, పూర్ణ కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. రవీందర్ రెడ్డి నిర్మించారు.

*నందమూరి కల్యాణ్​రామ్ 'బింబిసార' టీజర్​ను సోమవారం(నవంబరు 29) ఉదయం 9:15 గంటలకు రిలీజ్​ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో కేథరిన్, సంయుక్త హెగ్డే, వరీనా హుస్సేన్ హీరోయిన్లుగా నటించారు.

bimbisara teaser
కల్యాణ్​రామ్​ బింబిసార మూవీ

టైమ్ ట్రావెల్​ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కల్యాణ్​రామ్ వేషధారణ అలరిస్తోంది. ఈ చిత్రంతో వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చిరంతన్ భట్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

*యువ కథానాయకుడు నాగశౌర్య కొత్త సినిమా 'లక్ష్య'. దీని ట్రైలర్​ను డిసెంబరు 1న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్చరీ నేపథ్య కథతో ఈ సినిమా తీశారు.

naga shourya lakshya movie
నాగశౌర్య లక్ష్య మూవీ

ఇందులో కేతిక శర్మ హీరోయిన్​గా చేసింది. జగపతిబాబు కీలకపాత్రధారి. డిసెంబరు 10న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి డైరెక్టర్.

*'గమనం' సినిమాలోని 'సాంగ్ ఆఫ్ లైఫ్' లిరికల్​ గీతం రిలీజైంది. ఆద్యంతం ఆకట్టుకుంటూ చిత్రంపై అంచనాల్ని పెంచుతోంది. ఈ సినిమాలో శ్రియ, సుహాస్, ప్రియాంక జవాల్కర్, శివ కందుకూరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఆంథాలజీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతమందించారు. సుజనా రావ్ దర్శకత్వం వహించారు. డిసెంబరు 10న ఈ సినిమా వెండితెరపై విడుదల కానుంది.

*'లైగర్' షూటింగ్ ప్రస్తుతం యూఎస్​లోని లాస్ వెగాస్​లో జరుగుతోంది. ఇందులో భాగంగా ఓ కొత్త ఫొటోను హీరో విజయ్ దేవరకొండ పోస్ట్ చేశారు. ఛార్మి, హీరోయిన్ అనన్య పాండే.. విజయ్​ను హగ్ చేసుకుని ఉండగా, పక్కనే దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా కనిపించారు.

liger movie vijay devarakonda
లైగర్ మూవీ టీమ్

బాక్సింగ్ నేపథ్యంగా తీస్తున్న ఈ సినిమాలో విజయ్​తో పాటు దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్​ కూడా నటిస్తున్నారు. పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్​లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.