ETV Bharat / sitara

ఎన్​సీబీ విచారణకు దర్శక నిర్మాత కరణ్ జోహార్? - karan johar latest news

మాదక ద్రవ్యాల కేసులో భాగంగా ఎన్​సీబీ విచారణకు కరణ్ జోహార్ హాజరయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. శుక్రవారం ఇతడితో పాటే మరో ఏడుగురు బాలీవుడ్ సెలబ్రిటీలపై ఓ న్యాయవాది కేసు పెట్టారు.

karan-johar-can-be-summoned-by-ncb-for-investigation
కరణ్ జోహార్ ఎన్​సీబీ విచారణ
author img

By

Published : Sep 18, 2020, 5:52 PM IST

Updated : Sep 19, 2020, 7:40 AM IST

డ్రగ్స్​ కేసులో భాగంగా బాలీవుడ్​ దర్శకనిర్మాత కరణ్ జోహార్​ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారించనుంది. త్వరలో కరణ్​ సమన్లు జారీ చేసే అవకాశముంది. అకాళీదల్ నేత మజీందర్ సింగ్ ఫిర్యాదు నేపథ్యంలో ఎన్​సీబీ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

గతంలో కరణ్ జోహార్​ ఇచ్చిన పార్టీలో బాలీవుడ్​ స్టార్స్ దీపికా పదుకొణె, విక్కీ కౌశల్, మలైకా అరోరా, వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, షాహిద్ కపూర్​లు పాల్గొని డ్రగ్స్ సేవించారని ఫిర్యాదులో పేర్కొన్నారు మజీందర్. అయితే సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్​గా మారిన అనంతరం కరణ్ ఈ పార్టీపై వివరణ ఇచ్చారు. ఏ నటీనటులు, ఎలాంటి మాదక ద్రవ్యాలు సేవించలేదని స్పష్టం చేశారు.

కరణ్, సల్మాన్​ సహా ఎనిమిది మందిపై కేసు

salman ektha kapoor karan johar
సల్మాన్-ఏక్తా కపూర్-కరణ్ జోహార్

యువ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య విషయమై, ఎనిమిది మంది బాలీవుడ్​ ప్రముఖులపై ముజఫర్​పుర్​లో ఓ న్యాయవాది కేసు పెట్టారు. అతడి అవకాశాలు రాకుండా చేసి, చనిపోయేలా చేశారని అందులో పేర్కొన్నారు. నటి కంగనా రనౌత్​ను సాక్షిగా పేర్కొన్నారు. దీనిపై పూర్తి ఆధారాలు సమర్పించాలని సదరు న్యాయవాదికి కోర్టు తెలిపింది.

Last Updated : Sep 19, 2020, 7:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.