ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలు చాలామంది నిర్మాతలకు వరంగా మారాయి. ప్రేక్షకులూ ఓటీటీలకు బాగా అలవాటుపడుతున్నారు. చిన్న నిర్మాతలే కాదు అగ్ర నిర్మాణ సంస్థలూ ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యశ్ ఫిలిమ్స్ ఓటీటీ సినిమాల కోసం భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టనున్నట్లు తెలుస్తోంది.
నిర్మాత ఆదిత్య చోప్రా రూ.500 కోట్లతో భారీ ప్రణాళిక రచిస్తున్నట్టు బాలీవుడ్ సమాచారం. "ప్రపంచ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని భారతీయ మూలాలున్న కథల్ని తీసుకురావాలనుకుంటున్నారు. దాని కోసం భారీ స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయి" అని యశ్‌రాజ్ వర్గాలు చెప్పినట్టు తెలుస్తోంది.
ఇదీచూడండి: రూ.400 కోట్ల డీల్‌కు స్టార్ ప్రొడ్యూసర్ నో- థియేటర్పైనే ఆశలు