ETV Bharat / sitara

'విరాటపర్వం'లో నక్సలైట్​గా సాయిపల్లవి లుక్! - విరాటపర్వంలో సాయిపల్లవి

'విరాటపర్వం'లోని సాయిపల్లవి లుక్​ ఆకట్టుకుంటూనే, పలు సందేహాలు రేపుతోంది. ఇందులో ఈమె నక్సలైట్​గా కనిపించనుందని సమాచారం.

'విరాటపర్వం'లో నక్సలైట్​గా సాయిపల్లవి లుక్!
విరాటపర్వంలో సాయిపల్లవి లుక్
author img

By

Published : May 9, 2020, 9:48 AM IST

అడవి మార్గాన ఉన్న ఆ అమరవీరుల స్థూపం దగ్గర ఆమె ఎందుకు ఒంటరిగా కూర్చుంది? ఎవరి కోసం ఆమె నిరీక్షణ? ఆమె ఒడిలోని డైరీలోని రాసి ఉన్న అక్షరాలేమిటి? ఆమె పక్కనున్న బ్యాగ్​లో ఉన్నవేమిటి? ఈ ప్రశ్నలకు జవాబులు తెలియాలంటే 'విరాటపర్వం' విడుదల వరకు ఆగాల్సిందే. ఈరోజు సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆమె ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు. ఆద్యంతం ఆకట్టుకుంటూ చిత్రంపై అంచనాల్ని పెంచుతోందీ ఫొటో.

venu udugula virata parvam
దర్శకుడు వేణు ఊడుగుల పోస్ట్

అయితే 'విరాటపర్వం'లో సాయిపల్లవి నక్సలైట్​గా కనిపించనుందని టాక్. ఇందులో హీరోగా రానా నటిస్తున్నారు. నందితా దాస్, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పరిస్థితులు బాగుంటే ఈపాటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేదీ సినిమా. కరోనా ప్రభావంతో మధ్యలోనే ఆగిపోయింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.