ETV Bharat / sitara

'ఆ రహస్యం నీతో పాటే వెళ్లిపోయింది సుశాంత్​' - sushanth sucide case latest news

సుశాంత్​ మరణించాడనే వార్త తనను ఎంతగానో బాధించిందని నటి భూమిక ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలో భూమిక సోషల్ ‌మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. ఇకనైనా ఇతరులపై విమర్శలు గుప్పించే పద్దతికి స్వస్థి పలకాలని కోరారు. 'ధోనీ:అన్​టోల్డ్​ స్టోరీ' చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు.

Actress Bhumika tribute to the bollywood young hero sushanth singh death
భూమిక, సుశాంత్​ సింగ్​
author img

By

Published : Jun 23, 2020, 8:30 PM IST

బాలీవుడ్‌ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తనను ఎంతో బాధించిందని నటి భూమిక ఆవేదన వ్యక్తం చేశారు. సుశాంత్‌ కెరీర్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన సినిమా 'ఎమ్‌.ఎస్‌.ధోనీ: అన్‌టోల్డ్‌ స్టోరీ'. ఇందులో భూమిక సుశాంత్​ సోదరిగా నటించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది.

ఈ నెల 14న సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది. సోషల్‌ మీడియాలో ఆయన మృతిపై అనేక కోణాల్లో చర్చలు జరుగుతున్నాయి. గతంలో సుశాంత్‌కు జరిగిన విషయాల్ని వెలికితీస్తూ.. పలు నిర్మాణ సంస్థల్ని, సినీ ప్రముఖుల్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. బాలీవుడ్‌లో నెపోటిజం తీవ్ర స్థాయిలో ఉందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో భూమిక సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. ఇకనైనా ఇతరులపై విమర్శలు గుప్పించే పద్దతికి స్వస్తి పలకాలని కోరారు.

"ప్రియమైన సుశాంత్‌.. నువ్వు ఎక్కడున్నా ఆ దేవుడి చేతుల్లో భద్రంగా ఉంటావని నమ్ముతున్నా. నువ్వు మమ్మల్ని వదిలివెళ్లి వారం రోజులు దాటిపోయింది. ఏ కారణం వల్ల నువ్వు దూరమయ్యావు? ఆ రహస్యం నీతో పాటే వెళ్లిపోయింది. నీ హృదయం, మైండ్‌తోపాటు అది కూడా మట్టిలో కలిసిపోయింది. సుశాంత్‌ మరణం వల్ల బాధపడుతున్న వారంతా ఆ దేవుడ్ని ప్రార్థించాలని కోరుకుంటున్నా. ఆపై మిమ్మల్ని, మీ చుట్టూ ఉన్న వారిని జాగ్రత్తగా చూసుకోండి." అంటూ భూమిక పేర్కొన్నారు.

ఇదీ చూడండి:సుశాంత్​ సూసైడ్​: మరో నలుగురిపై కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.