ETV Bharat / sitara

Adavallu meeku joharlu: 'అదే ఈ సినిమాకు స్పెషల్​గా నిలుస్తుంది​' - శర్వానంద్​ ఆడవాళ్లు మీకు జోహార్లు

Sarvanand Rashmika Adavallu meeku joharlu: 'ఆడవాళ్లు మీకు జోహార్లు' లాంటి సినిమాలు చాలా అరుదుగా తెరకెక్కుతాయని అన్నారు నటి ఊర్వశి. ఈ చిత్రంలోని పాత్రల గురించి వివరించారు. శర్వానంద్​, రష్మిక మంచి నటులని ప్రశంసించారు. ఈ మూవీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Adavallu meeku joharlu
ఆడవాళ్లు మీకు జోహార్లు
author img

By

Published : Feb 19, 2022, 7:36 AM IST

Sarvanand Rashmika Adavallu meeku joharlu: "కామెడీ, రొమాన్స్‌, ఎమోషన్స్‌.. ఇలా అన్ని రకాల వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది" అన్నారు నటి ఊర్వశి. ఆమె.. రాధిక, ఖుష్బూ కీలక పాత్రల్లో నటించిన చిత్రమిది. శర్వానంద్‌, రష్మిక నాయకానాయికలుగా నటించారు. తిరుమల కిషోర్‌ దర్శకుడు. సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర విశేషాలను పంచుకున్నారామె.

"ఈ సినిమాలో హీరోకి ఐదుగురు తల్లులు ఉంటారు. అందులో ఓ తల్లితో కొంచెం ఎక్కువ అనుబంధం, ప్రేమ ఉంటాయి. అది ఎందుకు? ఆ తల్లి ఎవరు? అనేది తెరపై చూసి తెలుసుకోవాలి. ఐదుగురు తల్లుల్ని ఒప్పించి.. హీరో తన ప్రేయసిని ఎలా పెళ్లి చేసుకున్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. టైటిల్‌కు తగ్గట్లుగానే ఆడవారికి ప్రాధాన్యమున్న చిత్రమిది. వారి గొప్పతనాన్ని చాటే విధంగా ఉంటుంది. ఐదుగురు మహిళలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. ఇలాంటి స్క్రిప్ట్‌ రావడం చాలా అరుదు".

"నేను, శర్వానంద్‌ ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ సినిమాలో నటించాం. తను చాలా మంచి నటుడు. రష్మిక చక్కగా నటించింది. నా పాత్రకు నచ్చకపోతే ఏ పని చేయొద్దు అనే పట్టుదల వల్ల ఎలాంటి సమస్యలొచ్చాయన్నది ఆసక్తికరం".

"రాధిక, ఖుష్బూలతో కలిసి ఇప్పటికే చాలా సినిమాల్లో నటించాను. ఈ చిత్రంలో రాధికది చాలా పరిణతి ఉన్న పాత్ర. అందరికీ మంచి.. చెడులు చెబుతుంటుంది. ఖుష్బూ పాత్ర ఆసక్తికరంగానే ఉంటుంది. ఇలాంటి ఒక కాంబినేషన్‌ రావడం చాలా కష్టం. ఆరు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తి చేశాం. షూట్‌ ఆద్యంతం మేము ఎంజాయ్‌ చేశాం. సినిమా చూసి.. మీరు అంతే ఆనందిస్తారు".

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ''ఆడవాళ్లు మీకు జోహార్లు'తో ఓ కొత్త విషయాన్ని చెప్పబోతున్నాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.