ప్రముఖ తమిళ నటుడు వివేక్ గుండెపోటుకు గురయ్యారు. గురువారం కొవిడ్ వాక్సిన్ తీసుకున్న ఆయన మూర్ఛతో పడిపోవడం వల్ల ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.

అయితే వివేక్ ఆరోగ్యంపై ఆస్పత్రి వర్గాలు పూర్తి వివరాలు బహిర్గతం చేయలేదు. తమిళ చిత్రాల్లో రజనీకాంత్, విజయ్, అజిత్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు వివేక్. సహాయక పాత్రలతో పాటు హాస్యనటుడిగానూ ఆయన మెప్పించారు.
ఇదీ చూడండి: 'సెహరి' టీజర్.. 'జాతిరత్నాలు' వీడియో సాంగ్