ETV Bharat / sitara

రియాకు డ్రగ్స్​ సరఫరా చేసిన వ్యక్తి​ అరెస్టు - రియా డ్రగ్​ పెడ్లర్​ అరెస్టు

సుశాంత్ ప్రేయసి, నటి రియా చక్రవర్తికి డ్రగ్స్​ సరఫరా చేసిన వ్యక్తిని ఎన్​సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం అతడిని కోర్టు ముందు హాజరు పరచనున్నారు.

rhea drug peddler arrest
రియా
author img

By

Published : Dec 9, 2020, 10:39 AM IST

బాలీవుడ్​ హీరోయిన్​ రియా చక్రవర్తి, ఆమె సోదరుడికి డ్రగ్స్​ సరఫరా చేసిన వ్యక్తిని ఎన్​సీబీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి డబ్బు, మాదక ద్రవ్యాలు, హై క్వాలిటీ మాలానా క్రీమ్​ను స్వాధీనం చేసుకున్నారు. మరికాసేపట్లో అతడిని కోర్టు ముందు హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది.

జూన్‌ 14న తన సొంత ఇంట్లో సుశాంత్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్​ విషయం వెలుగులోకి రావడం వల్ల ఎన్​సీబీ రంగంలోకి దిగింది. నటుడు మృతిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి ప్రియురాలు రియా, ఆమె సోదరుడుతో పాటు 18 మందిని అరెస్టు చేసింది. కొంతకాలం క్రితం బెయిల్​పై రియా విడుదలవగా, డిసెంబర్​ 2వ తేదీన షోవిక్​ బెయిల్​పై బయటకు వచ్చాడు.

ఇదీ చూడండి : 'దర్యాప్తును తప్పుదోవ పట్టించారు.. చర్యలు తీసుకోండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.