మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా(maa eletions 2021) ఎన్నికైన తర్వాత నరేశ్ ఒక్క పని కూడా చేయలేదని సినీ నటుడు నాగబాబు విమర్శించారు. నరం లేని నాలుకతో ఇష్టం మొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు.
"అక్టోబరు 10న 'మా' ఎన్నికలు(maa eletions 2021) అయిపోయిన తర్వాత ప్రకాశ్‌రాజ్(prakash raj panel) ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోతాడని విష్ణు ప్యానెల్(machu vishnu panel) చేస్తున్న విమర్శలు సరైనవి కావు. ప్రకాశ్‌రాజ్‌కు హైదరాబాద్‌లో ఇల్లు ఉంది. ఇతర రాష్ట్రాల్లో షూటింగ్ ఉంటే వెళ్తాడు. అది తప్పదు. విష్ణు(machu vishnu panel), నరేశ్‌లు వెళ్లకుండా ఉంటారా? అధ్యక్షుడైన తర్వాత నరేశ్ షూటింగ్‌కు వెళ్లలేదా? నిజం చెప్పాలంటే ఇక్కడ ఉన్న నరేశ్ కనీసం సమయం కేటయించలేదు. 'మా' సభ్యుల గురించి పట్టించుకోలేదు. సెక్రటరీగా ఉన్నప్పుడు అమెరికాలో ప్రోగ్రాం జరిగితే నరేశ్ ఎందుకు వెళ్లలేదు"
"లోకల్, నాన్‌లోకల్ అన్న భావన తనకు లేదని మొదట చెప్పింది నరేశ్. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని చెప్పాడు. ఇప్పుడు మాస్క్ తీశాడు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగువారు లేరా?అని నరేశ్ అనడం సరికాదు. మేమూ పోటీ చేయగలం. కానీ, మాకున్న పరిస్థితులు వేరు. అయితే, ప్రకాశ్‌రాజ్(prakash raj panel) ఉత్సాహంతో ముందుకు వచ్చారు. 'నేను చాలా మందికన్నా బాగా తెలుగు మాట్లాడతాను. తెలుగు భాష నన్ను చూసి గర్వపడుతుంది' అని మాత్రమే ప్రకాశ్‌రాజ్ అన్నాడు. నరేశ్‌లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాడు కాదు. 'స్థానికత లేదు' అని ఎన్నిసార్లు అంటారు. అలాంటప్పుడు మెంబర్‌షిప్ ఎందుకిచ్చారు? ఇక నుంచి తెలుగు వాళ్లే 'మా'లో ఉండాలని రూల్ పెట్టండి. నరేశ్ అధ్యక్షుడిగా ఉండి ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. శివాజీరాజా కనీసం ఒక్కటైనా చేశాడు. దాన్ని మీడియా ముందు పెట్టి నరేశ్ నానా యాగీ చేశాడు"
"మా' నిబంధనల ప్రకారం నటులెవరైనా మెంబర్ కావచ్చు. ఒకప్పుడు మెంబర్‌షిప్ తీసుకోవాలని నటీనటులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ నియమ, నిబంధనలు విష్ణు తీసేస్తారా? తెలుగులో ఎంతో మంది పాన్ ఇండియా మూవీలు తీస్తున్నారు. ఒకవైపు తెలుగు సినిమాను ప్రపంచస్థాయి తీసుకెళ్దామని కొందరు చూస్తుంటే, ఇంకొందరు.. 'నా ఇండస్ట్రీ, నేను, తెలుగువాళ్లే ఉండాలి' అనే సంకుచిత మనస్తత్వం ఎందుకు? ఇక్కడ అతిథులు ఎవరూ లేరు. ఒక రకంగా హైదరాబాద్‌లో ఉన్న మేమంతా ఆంధ్రా నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్లమే. 'మీరెందుకు ఇక్కడ ఉన్నారు' అని సీఎం కేసీఆర్ ఎప్పుడూ అనలేదే? మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు చీకటి యుగంలో బతుకుతున్నారు. లా చదివిన వ్యక్తి అయి ఉండి, సీవీఎల్ అవాకులు చెవాకులు పేలుతున్నారు. మా ఎన్నికలను రాజకీయం చేయొద్దు. ఆయనపై భాజపా చర్యలు తీసుకోవాలి. ప్రకాశ్‌రాజ్(prakash raj panel)కు దేశమంటే అభిమానం ఉంది. ఆయనతో నాకు అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. అయితే, ఇద్దరం కోరుకునేది సంక్షేమం"
"పవన్‌కల్యాణ్ వైపు ఉన్నారా? ఇండస్ట్రీ వైపు ఉన్నారా? అని మంచు విష్ణు మాట్లాడింది చాలా తప్పు. అందుకు విష్ణు క్షమాపణ చెప్పాలి. ఇండస్ట్రీని ముక్కలు చేసే ప్రయత్నం అది. ఎవరితోనైనా మాట్లాడగలిగే సత్తా కలిగిన వ్యక్తి ప్రకాశ్‌రాజ్(prakash raj panel). తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన మాట్లాడగలరు. ఇండియాలోని ప్రతి అసోసియేషన్‌తో సమన్వయం చేయగలడు. అలాంటి వ్యక్తిని 'మా' సభ్యులు ఎన్నుకోవాలి. విష్ణుకు ఓటు వేయమని కోరుతూ నరేశ్ 'మా' సభ్యుల అకౌంట్‌లో రూ.10వేలు వేశాడట. గెలిచిన తర్వాత రూ.15వేలు ఇస్తానని అన్నారట. సభ్యులను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. వెటకారంగా అన్నా కూడా మంచు విష్ణు రూ.75వేలు వేస్తే సంతోషమే. ఈ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ తప్పక గెలుస్తాడు. చివరకు ఎవరు గెలిచినా ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం అందరం కలిసి పనిచేస్తాం" అని నాగబాబు అన్నారు.