ETV Bharat / sitara

'ది కశ్మీర్​ ఫైల్స్​'.. ఆమిర్​ ఖాన్​ ఏమన్నారంటే?

The Kashmir Files Aamir khan: 'ది కశ్మీర్​ ఫైల్స్​' సినిమాను ప్రతీ భారతీయుడు తప్పకుండా వీక్షించాలని అన్నారు స్టార్ హీరో ఆమీర్​ ఖాన్​. ఈ సినిమా విజయం సాధించినందుకు ఎంతో ఆనందిస్తున్నట్లు తెలిపారు.

AAmir khan
ఆమిర్​ ఖాన్​
author img

By

Published : Mar 21, 2022, 5:45 PM IST

The Kashmir Files Aamir khan: దేశవ్యాప్తంగా 'ది కశ్మీర్​ ఫైల్స్' ​సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. తొలిరోజు సాధారణ కలెక్షన్లతో మొదలై ప్రస్తుతం బాక్సాఫీస్​ ముందు రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా గురించి బాలీవుడ్​లో ఎవరూ మాట్లాడట్లేదని ఓ వివాదం నడుస్తోంది. అక్షయ్​కుమార్​, కంగనా రనౌత్​ మినహా ఎవరూ దీనిపై స్పందించలేదు! అయితే ఈ క్రమంలోనే 'కశ్మీర్​ ఫైల్స్​'పై స్పందించారు ఆమిర్​ఖాన్. ప్రతి ఒక్క భారతీయుడు తప్పకుండా ఈ చిత్రాన్ని వీక్షించాలని అన్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' ప్రమోషన్స్‌లో భాగంగా దిల్లీలో నిర్వహించిన ఓ వేడుకకు విచ్చేసిన ఆయన​ ఈ వ్యాఖ్యలు చేశారు.

'ది కశ్మీర్‌ ఫైల్స్‌' చిత్రాన్ని వీక్షించారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు ఆమిర్​. "వర్క్‌ బిజీలో ఉండటం వల్ల నేనింకా ఆ సినిమా చూడలేదు. కానీ తప్పకుండా చూస్తాను. 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' మన చరిత్ర నిదర్శనం. ఒకానొక సమయంలో కశ్మీర్‌ పండితులపై జరిగిన తిరుగుబాటు.. విచారకరం. ఇలాంటి చిత్రాలను ప్రతి ఒక్క భారతీయుడు చూడాలి. మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరినీ ఈ చిత్రం భావోద్వేగానికి గురి చేసింది. ఈ సినిమా విజయం సాధించినందుకు ఎంతో ఆనందిస్తున్నా" అని ఆమిర్​ తెలిపారు.

కశ్మీరీ పండితుల జీవితంపై బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి రూపొందించిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’. 1990లలో జమ్మూ-కశ్మీర్‌లో చేలరేగిన తీవ్రమైన ఉగ్రవాదంలో పండిట్స్‌ ప్రాణాలు కోల్పోయారు. ఆ దారుణాలు చూడలేక ఎంతోమంది సొంతూరుని వదిలిపెట్టి కట్టుబట్టలతో వలస వెళ్లిపోయారు. ఆ కన్నీటి వెతల రూపమే ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’.

ఇదీ చూడండి: తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. బేబీ బంప్ ఫోటోలు వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.